కాంగ్రెస్ లో కొత్త లొల్లి -వన్ పర్సన్ వన్ టికెట్ !

అంతర్గత ప్రజాస్వామ్యానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే కాంగ్రెస్ లో నిత్యం ఏదో ఒక లొల్లి లేకపోతే తమకు రాజకీయం గా ఉనికి ఉండదని ఆ పార్టీ నేతలు భావిస్తారో ఏమిటో తెలియదు గానీ రెండు రోజులకు ఒకసారి ఏదో ఒక సెన్సేషన్ కి ఆ పార్టీ వేదికగా మారుతుంది.నిన్న మొన్నటివరకు రేవంత్( Revanth Reddy ) వ్యాఖ్యలపై చర్చలు మరియు పార్టీ కీలక నేతల మధ్యన వర్గ పోరుతో సతమతమైన కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా పార్టీ తీసుకువచ్చిన ఒక కొత్త నిబంధనతో మరొకసారి నేతల మధ్య అంతర్గత విభేదాలు బగ్గుమంటున్నాయి.

 New Tension In T Congress , Revanth Reddy , Congress Party ,telangana Congres-TeluguStop.com

ఇక విషయంలోకి వెళ్తే గత రాజస్థాన్ ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ ని స్ట్రిక్ట్ గా అమలు చేస్తుంది అది ఏమిటంటే వన్ ఫ్యామిలీ -వన్ టిక్కెట్ అండ్ వన్ పర్సన్- వన్ పోస్ట్ అంటే ఎంతటి కీలకమైన నేతకైనా ఆ కుటుంబాన్ని నుంచి ఒకటి మాత్రమే టికెట్ ఇస్తామని జోడు- పదవులు ఇకపై కుదరదు అంటూ కాంగ్రెస్ తేల్చేసింది.

Telugu Brs, Congress, Gandhi Bhawan, Revanth Reddy-Telugu Political News

గత కొన్ని రోజులుగా ఈ విషయంపై కాంగ్రెస్ గట్టిగానే నిలబడింది .అయితే తెలంగాణలో దశాబ్దాలు తరబడి కాంగ్రె స్ ను అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లకు ఈ డిక్లరేషన్ కంటగింపుగా మారింది.ఎందుకంటే ఇప్పుడు తమతో పాటు తమ కుటుంబ సభ్యులకు టికెట్ కోరుకుంటున్న నేతలు పదుల సంఖ్యలోనే ఉన్నారు.

దాంతో కాంగ్రెస్( Comgress party ) ప్రవేశపెట్టిన ఈ కొత్త మెలిక ఈ నేతలకు పెద్ద అవరోధంగా మారే అవకాశం కనిపిస్తుంది.అయితే తమకు హై కమాండ్ తో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ తమతో పాటు కుటుంబ సభ్యులకు టికెట్ కేటాయించుకోవాలని పట్టుదలతో కాంగ్రెస్లోని కొంతమంది నేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది.

Telugu Brs, Congress, Gandhi Bhawan, Revanth Reddy-Telugu Political News

నిజానికి కాంగ్రెస్ పార్టీ నే కుటుంబ నాయకత్వంతో నడుస్తున్నప్పుడు తమ కుటుంబాన్ని నుంచి ఒకటి కన్న ఎక్కువమంది నేతలు ఉంటే తప్పేమిటంటూ కొంతమంది నేతలు ఆఫ్ ద రికార్డు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది .రూల్స్ అన్నవి అందరికీ ఉండాలని కిందిస్థాయి నేతలకు మాత్రమే ఇలాంటి నిబంధనలు విధించడం ఏమిటంటూ చాలామంది నేతలు వాపోతున్నారట .అయితే ఇవన్నీ పైకి చెప్పే నీతులు మాత్రమే అని ఎన్నికలకు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అయినా సామదాన బేద దండోపాయాలు ఉపయోగించి తాము టికెట్లు దక్కించుకోగలమన్న భరోసా కొంతమంది నేతలలో కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది .మరి కాంగ్రెస్ కొత్త టెన్షన్ ఏ విధంగా ముగుస్తుందో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube