ఆసుపత్రి మొదటి అంతస్తు పై 40 కేవీ రూప్ టాప్ సోలార్ ప్లాంట్ , తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా సిరిసిల్ల లో ఏర్పాటు నేడు మంత్రి కే టి ఆర్( Minister KTR ) చేతుల మీదుగా ప్రారంభం రాజన్న సిరిసిల్ల( Rajanna Sirisilla ) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 40 కేవీ రూప్ టాప్ సోలార్ ప్లాంట్ ను ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు ప్రారంభించనున్నారు.తెలంగాణలోనే ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో 40 కేవీ రూప్ టాప్ సోలార్ ప్లాంట్ చేయడం ఇదే ప్రథమం.ఎప్పుడైనా విద్యుత్ అంతరాయం కలిగిన సందర్భంలో రోగులకు అసౌకర్యం కలుగకుండా విద్యుత్ అవసరాలు తీర్చేలా ప్రత్యామ్నాయంగా
సోలార్ ప్లాంట్ ను రూ.34 లక్షల రూపాయలతోమంత్రి కే టి ఆర్ మార్గదర్శనం మేరకు ఏర్పాటు చేశారు.ఈ సోలార్ ప్లాంట్ ప్రతినెలా 5,100 యూనిట్ ల విద్యుత్ ను ఉత్పత్తి చేయనుంది.తద్వారామొత్తం ప్రభుత్వం జనరల్ ఆస్పత్రి విద్యుత్ అవసరాలలో ఈ సోలార్ ప్లాంట్ 33 శాతం నుంచి 40 శాతం మేర విద్యుత్ అవసరాలు తీర్చనుంది.ఆ మేరకు కరెంటు బిల్లుల భారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తగ్గనుంది.
130 అదనపు బెడ్స్ ను ప్రారంభించనున్న మంత్రి
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.6 కోట్ల 80 లక్షల రూపాయలతో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం 130 అదనపు బెడ్స్ సామర్ధ్యంతో నిర్మించిన రెండవ అంతస్తును ఈనెల 18న మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు.ఇప్పటికే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 200 పడకలు ఉండగా ఇప్పుడు అదనంగా వచ్చిన 130 పడకలతో మొత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సామర్థ్యం 330 కి పెరిగింది.
సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మంత్రులు
సిరిసిల్ల పట్టణం మొదటి బైపాస్ లోని నర్సింగ్ కళాశాల ,కూడలి లో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రులు కే తారక రామారావు, శ్రీనివాస్ గౌడ్( Srinivas Goud ) లు ఆవిష్కరించనున్నారు.
బోటింగ్ యూనిట్ ను ప్రారంభించనున్న మంత్రులు
పర్యాటకులుమధ్య మానేరు జలాశయం అందాలను వీక్షిస్తూ బోటింగ్ చేసేందుకు వీలుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.3 కోట్ల 16 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బోటింగ్ యూనిట్ ను మంత్రులు కే తారక రామారావు, శ్రీనివాస్ గౌడ్ లు ప్రారంభించనున్నారు.