అప్పుడు రైతుబిడ్డ.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్.. గ్రూప్1 సెకండ్ ర్యాంకర్ పావని సక్సెస్ స్టోరీ ఇదే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా గ్రూప్1 ఫలితాలు( Group1 Results ) విడుదలయ్యాయి.గ్రూప్1 ఫలితాల్లో భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా కడప జిల్లాలోని మైదుకూరుకు చెందిన పావని సెకండ్ ర్యాంక్ సాధించారు.సెకండ్ ర్యాంక్ సాధించిన పావని సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.రైతుబిడ్డ నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగిన పావని సక్సెస్ స్టోరీ హాట్ టాపిక్ అవుతోంది.

 Group1 Second Ranker Pavani Success Story Details Here Goes Viral In Social Medi-TeluguStop.com
Telugu Andhra Pradesh, Appsc, Ranker, Mains Exam, Pavani, Story-Latest News - Te

కృషి, పట్టుదలతో పావని( Pavani ) తను కన్న కలలను నెరవేర్చుకున్నారు.సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన పావని ఒకవైపు లెక్చరర్ గా పని చేస్తూనే మరోవైపు గ్రూప్1 పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యారు.ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్1 పరీక్షల్లో పావని సెకండ్ ర్యాంక్ సాధించడం గమనార్హం.పావనికి గ్రూప్1 ఫలితాల్లో సెకండ్ ర్యాంక్ రావడంతో ఆమె బంధువులు, స్నేహితుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Telugu Andhra Pradesh, Appsc, Ranker, Mains Exam, Pavani, Story-Latest News - Te

ఎన్నో సంవత్సరాలుగా తాను కన్న కలను సాధించానని ఆమె చెబుతున్నారు.తన తల్లీదండ్రుల శ్రమ వల్లే తాను ఈ స్థాయిలో సక్సెస్ సాధించడం సాధ్యమైందని పావని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఎంతో కష్టపడి లక్ష్యాన్ని సాద్జించి కన్న కలను నెరవేర్చుకున్నానని ఆమె తెలిపారు.మెయిన్స్ ఎగ్జామ్( Mains Exam ) లో ప్రశ్న అడిగే తీరు ఆధారంగా జవాబులను ఇచ్చానని పావని కామెంట్లు చేశారు.ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.గ్రూప్1 ఫలితాలలో టాప్ 10లో ఆరుగురు అమ్మాయిలు ఉండటం గమనార్హం.పావని కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పావని తన ప్రతిభతో సత్తా చాటుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.పది, ఇంటర్ ఫలితాల్లో సైతం పావని అత్యుత్తమ ఫలితాలతో సత్తా చాటారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube