నాగ శౌర్య( Naga Shaurya ) హీరో గా రీసెంట్ గా వచ్చిన రంగబలి సినిమా( Rangabali Movie ) యావరేజ్ గా ఆడింది.అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాల్సింది.
కానీ కొంచం లో మిస్ అయి ఒక యావరేజ్ ఫిల్మ్ గా మిగిలిపోయింది…దీనితో నాగ శౌర్య ఈ సినిమాతో తనకి భారీ హిట్ వస్తుంది అని అనుకున్నప్పటికీ అది కుదరలేదు ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కామెడీ గా బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా లాగ్ అయింది.అందుకే ఈ సినిమా హిట్ అవ్వకుండా యావరేజ్ గా మిగిలిపోయింది…

ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే ఈ సినిమా డైరెక్టర్ అయిన పవన్ బాసంశెట్టి( Pawan Basamsetti ) మాత్రం ఒక మంచి డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు.దీనితో ఆయన తర్వాత ఏ హీరో తో సినిమా చేస్తున్నాడు అనే టాక్ ఇండస్ట్రీ లో నెలకొంది ఇక ఈ విషయం మీదనే ఒక న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది.ఇప్పటికే ఆయన హీరో విజయ్ దేవరకొండ కి ( Vijay Devarakonda ) ఒక కథ చెప్పాడట అది బాగా నచ్చిన విజయ్ ఆయనతో మనం ఈ సినిమా చేద్దాం అని మాట కూడా ఇచ్చాడట… అయితే ఇప్పుడు విజయ్ ఈయన తో సినిమా చేస్తాడా, లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది…అయితే డైరెక్టర్ పవన్ తీసిన రంగ బలి సినిమా యావరెజ్ అయిన కూడా ఆయన డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది అని ఆయనకి చాలా మంది నుంచి ప్రశంశలు అయితే దక్కాయి…

ఇక ఈయన కనక విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తే ఈయన చాలా తక్కువ టైం లోనే స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవచ్చు…ఇక విజయ్ గురించి చూసుకుంటే ఒక పక్క గౌతమ్ తిన్ననూరి( Gautam Tinnanuri ) సినిమా చేస్తూనే మరో పక్క డైరెక్టర్ పరుశురాం తో( Director Parasuram ) మరో సినిమా చేస్తున్నాడు.విజయ్ ఈ రెండు సినిమాలతో మంచి హిట్ కొడతాను అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు… అయితే ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత ఇంకో సినిమా కమిట్ అయ్యే ఆలోచనలో విజయ్ ఉన్నట్టుగా తెలుస్తుంది…మరి ఈ యంగ్ డైరెక్టర్ కి విజయ్ ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది వేచి చూడాలి…
.







