కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు కొత్త రూల్స్..వర్కౌట్ అవుతుందా..?

కాంగ్రెస్ ( Congress ) కొన్ని ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ.దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పార్టీ ఢిల్లీ అధిష్టానం వేదికగా దేశమంతా కార్యకలాపాలు కొనసాగుతాయి.

 New Rules For Congress Mla Candidates.. Will There Be A Workouandida . Revanth-TeluguStop.com

ఇప్పుడు ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన ఈ పార్టీ ప్రస్తుతం చతికిలపడింది.ఈసారి ఎలాగైనా దేశంలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించాలని అన్ని రాష్ట్రాలపై అధిష్టానం దృష్టి పెట్టి ముందుకు సాగుతోంది.

ఈ తరుణంలోనే తెలంగాణ ( Telangana ) ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తిగా కాంగ్రెస్ బలహీనపడింది.ఇక అలాంటి తరుణంలోనే సోనియా మరియు రాహుల్ గాంధీ( Rahul gandhi ) ఆలోచన చేసి చురుకైన లీడర్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ గా చేశారు.

దీంతో కాంగ్రెస్ లో కొత్త ఊపు వచ్చింది.రేవంత్ రెడ్డి తనదైన మాటలతో కొత్త ఊపుతో కార్యకర్తలకు అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు.

అయితే ఆయన పదడుగులు ముందుకు వేస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు, నాలుగు అడుగులు వెనక్కి గుంజుతున్నారు.ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి ( Revanth reddy ) పై ఫిర్యాదులు కూడా చేశారు.

కానీ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డికే ఎక్కువగా సపోర్ట్ ఇస్తూ తన నిర్ణయాలను గౌరవిస్తుంది.

Telugu Congress, Gandhi Bhavan, Mla Candis, Rahul Gandhi, Revanth Reddy, Sonia G

ఈ తరుణంలోనే కాంగ్రెస్ ను పూర్తిగా వడగట్టి గెలుపు గుర్రాలను ఈసారి ఎన్నికల్లో నిలబెట్టాలని వ్యూహం పన్నుతున్నట్టు తెలుస్తోంది.ఈ సందర్భంగా కొత్తగా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను తెలుసుకునే ప్లాన్ లో భాగంగా ఈరోజు తీసుకువచ్చింది.కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులైన పోటీ చేయవచ్చని పోటీ చేయాలనుకునే వ్యక్తులు తప్పనిసరిగా 18 నుంచి 25 వరకు అప్లికేషన్లు పెట్టుకోవాలని తెలియజేసింది.

ఈ క్రమంలో ఓసి అభ్యర్థులు అయితే 50వేల రూపాయలు బీసీలయితే 25వేల రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Telugu Congress, Gandhi Bhavan, Mla Candis, Rahul Gandhi, Revanth Reddy, Sonia G

ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి రుసుము లేదని అన్నది.ప్రతి నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంతమంది అయినా దరఖాస్తు చేసుకోవచ్చని ఆప్షన్ ఇచ్చింది.దరఖాస్తు చేసుకున్న వారికే టికెట్ల కేటాయింపు ఉంటుందట.

అదే ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఆ ధరఖాస్తులను పరిశీలించి కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో స్క్రీనింగ్ నిర్వహిస్తారట.ఈ రూల్స్ వల్ల కాంగ్రెస్ ( Congress ) కు రెండు రకాలుగా కలిసివస్తుంది.

మునుపటిలా నాకు టికెట్ అంటే నాకు టికెట్ అనే లొల్లి లేకుండా, పోటీ చేసే అభ్యర్థులను ముందుగానే తెలుసుకోవచ్చు.దీని ద్వారా నియోజకవర్గంలో గొడవలు ఏర్పడకుండా ఎవరికో ఓకరికి టికెట్ కేటాయించి సాఫీగా ఎన్నికల బరిలో ఉండవచ్చని ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.

మరో రకంగా అయితే పార్టీకి కాస్త అమౌంట్ కూడా వచ్చినట్టు ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube