పవన్ విషయంలో అప్పుడు... ఇప్పుడు నన్ను తిడుతూనే ఉన్నారు: రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య సినీ నటి రేణు దేశాయ్( Renu Desai ) ఈ మధ్యకాలంలో తన వ్యక్తిగత విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె పవన్ కళ్యాణ్ గురించి గతంలో చేసిన విమర్శలు కారణంగా పవన్ కళ్యాణ్ అభిమానులు తన పట్ల భారీగానే ట్రోల్ చేశారు.

 Renu Desai About Pawan Kalyan Fans Trolling Her,pawan Kalyan,renu Desai,politica-TeluguStop.com

ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ కి వార్నింగ్ ఇచ్చినంత పని కూడా చేశారు.ఇలా పవన్ కళ్యాణ్ విడాకుల( Pawan Kalyan Divorce ) విషయంలో తనని ఎలా మోసం చేశారనే విషయం గురించి ఈమె బయట పెట్టిన ప్రతిసారి పవన్ ఫ్యాన్స్ తనని ట్రోల్ చేస్తారు.

తాజాగా రేణు దేశాయ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Divorce, Pawan Fans, Pawan Kalyan, Politically, Renu Desai-Movie

గతంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నా పట్ల చేసినటువంటి మోసానికి సంబంధించిన వాస్తవాలను నేను బయట పెట్టడంతో పవన్ అభిమానులు తనని ట్రోల్ చేయడమే కాకుండా కొందరు డబ్బులు ఇచ్చి నా చేత ఈ పనులు చేయించారు అంటూ నన్ని చాలా తిట్టారని ఈమె వెల్లడించారు.ఇప్పుడు ఒక దేశ పౌరురాలిగా నేను పవన్ కళ్యాణ్ కు రాజకీయపరంగా మద్దతు( Political Support ) తెలుపుతూ ఒక వీడియోని చేశాను.అయితే ఇప్పుడు కూడా తనని తిడుతున్నారు అంటూ రేణు దేశాయ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

Telugu Divorce, Pawan Fans, Pawan Kalyan, Politically, Renu Desai-Movie

పవన్ కళ్యాణ్ తనని మోసం చేశారంటూ గతంలో మాట్లాడిన మాటలు వాస్తవమే అయితే ఇప్పుడు ఆయనకు మద్దతు తెలుపుతూ తనకు అవకాశం ఇవ్వండి అంటూ మాట్లాడిన మాటలు కూడా వాస్తవమేనని తెలిపారు.అయితే ఇలా తన గురించి నిజాలు మాట్లాడిన ప్రతిసారి తనకు ఎవరో డబ్బులు ఇచ్చి ఇలా చేయించారు అంటూ కొందరు తనపై దుర్భాషలాడుతున్నారు.దయచేసి ఇలాంటి అసభ్యకరమైన పదాలతో నన్ను తిట్టకండి అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదిక( Social Media )గా పవన్ కళ్యాణ్ అభిమానులను అలాగే నేటిజన్స్ ను వేడుకొంటూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube