తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది.తిరుమల కొండకు వెళ్లే నడకదారిలో లక్ష్మీ నరసింహా ఆలయం సమీపంలో అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.
ఇటీవల నడక మార్గంలో వెళ్తూ లక్షిత అనే చిన్నారి చిరుతపులి దాడిలో మరణించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు, టీటీడీ అధికారులు నడక దారిలో భక్తుల కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగానే నడక దారిలో 300 కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు చిరుతలను పట్టుకునేందుకు బోన్లను సైతం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రాత్రి 1.30 సమయంలో చిరుత బోనులో చిక్కిందని అధికారులు తెలిపారు.బోనులో చిక్కింది మగ చిరుతగా నిర్ధారించిన అధికారులు భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
అదేవిధంగా ఆపరేషన్ చిరుత కొనసాగిస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.







