ఆ పని చేయడంతో ఇంట్లో అందరూ బాగా తిట్టారు: నవీన్ పోలిశెట్టి

నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) పరిచయం అవసరం లేని పేరు ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నవీన్ పోలీస్ శెట్టి జాతి రత్నాలు( Jathi Ratnalu ) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి( MissShetty Mr.

 Naveen Polishetty Comments Miss Shetty-mr Polishetty Movie, Naveen Polishetty, M-TeluguStop.com

Polishetty ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమాలో నటి అనుష్క శెట్టి( Anushaka Shetty ) నటించిన సంగతి మనకు తెలిసిందే.

సెప్టెంబర్ 7వ తేదీ విడుదల కానున్నటువంటి ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Telugu Saisrinivasa, Anushaka Shetty, Jathi Ratnalu, Tollywood-Movie

ఈ క్రమంలోనే నవీన్ పోలిశెట్టి ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇంటర్వ్యూలో భాగంగా ఈయన ఎన్నో విషయాల గురించి తెలియజేశారు.ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలోకి తాను వచ్చిన సమయంలో తన కుటుంబ సభ్యులు తనని బాగా తిట్టారని తన కుటుంబ పరువు ప్రతిష్టలను పాడు చేస్తున్నానంటూ తన తల్లిదండ్రులు తనని తిట్టడమే కాకుండా దాదాపు పది సంవత్సరాల పాటు ఎంతో ఇబ్బందులు కూడా పడ్డారని ఈయన తెలియజేశారు.సినిమాలలోకి రాకముందు తాను ఒక ఇంజనీర్ చేతిలో మంచి ఉద్యోగం అయితే ఆ ఉద్యోగాన్ని వదులుకొని ఇండస్ట్రీలోకి రావడంతో నన్ను బాగా తిట్టారని తెలిపారు.

Telugu Saisrinivasa, Anushaka Shetty, Jathi Ratnalu, Tollywood-Movie

ఇలా దాదాపు పది సంవత్సరాల పాటు ఎంతో కష్టపడిన తర్వాత ఏజెంట్ ఆత్రేయ సినిమాకి ముందు తన ఇంటిపేరును పాడు చేస్తున్నానని ఇంట్లో వాళ్ళు తిట్టారు.అయితే ఆ టైటిల్ లోనే ఇంటిపేరు ఉండడంతో నాన్న ఎంతో సంతోషపడ్డారని ఈయన తెలియచేశారు.ఇక జాతి రత్నాలు సినిమా ఆ స్థాయిలో ప్రేక్షకులను అల్లరిస్తుందని అసలు ఊహించలేదు అంటూ ఈయన తెలియజేశారు.

ఇక ఈ సినిమాలో నటి అనుష్కతో కలిసి నటించడం తనకు చాలా సరదాగా అనిపించింది అంటూ నవీన్ పోలిశెట్టి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube