సీనియర్ నరేష్( Sr.Naresh ) కొడుకు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ వివాదాలకు దూరంగా ఉంటారు.సాయితేజ్ బెస్ట్ ఫ్రెండ్స్ లో నవీన్ విజయ్ కృష్ణ ఒకరు కాగా తాజాగా విజయ్ కృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
సాయితేజ్, కలర్స్ స్వాతి జంటగా సత్య అనే షార్ట్ ఫిల్మ్ కు విజయ్ కృష్ణ( Vijay Krishna ) దర్శకత్వం వహించారు.
తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్( Short film ) నుంచి సోల్ ఆఫ్ సత్య సాంగ్( Soul of Satya Song ) రిలీజ్ కాగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా విజయ్ కృష్ణ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ఈ స్టేజ్ ఎక్కుతానో లేదో అనే డౌట్ ఉన్నరోజులు గుర్తుకొస్తున్నాయని ఆ సంవత్సరం లైఫ్ లో చాలా కోల్పోయానని మళ్లీ అక్కడినుంచి ఇక్కడివరకు వచ్చానని విజయ్ కృష్ణ వెల్లడించారు.

నేను మీ అందరి కామెంట్లు చదివానని మళ్లీ ఇంత లావై మీ ముందుకు వచ్చానని విజయ్ కృష్ణ చెప్పుకొచ్చారు.లైఫ్ లో ముందుకెళ్లడం ముఖ్యమని అమ్మ నేత్ర, నాన్నమ్మ విజయనిర్మల( Vijayanirmala ) నేనెప్పుడూ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకున్నారని వాళ్లు బ్రతికుండగా అది నెరవేర్చలేకపోయానని అందుకే వెనక్కు వెళ్లకుండా తిరిగి వచ్చానని విజయ్ కృష్ణ పేర్కొన్నారు.

నాకు మా నాన్నమ్మే స్పూర్తి అని నాన్నమ్మ సినిమాలు చేసే సమయంలో నేను సెట్స్ లో ఉండేవాడినని అవన్నీ చూసి నాకు డైరెక్టర్ కావాలని అనిపించేదని విజయ్ కృష్ణ అన్నారు.నాన్నమ్మ మాత్రం నేను నటుడిని కావాలని కోరుకుందని విజయ్ కృష్ణ చెప్పుకొచ్చారు.నాన్నమ్మ కోసం నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు దర్శకుడిగా మారానని విజయ్ కృష్ణ అన్నారు.
ఆయన చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.







