పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో పులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.కాట్రగడ్డ, చిన్న దిమిలి, పెద్దదమిలి పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు.
దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ క్రమంలోనే మన్యం జిల్లా భామిని మరియు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.







