రామ్‌ చరణ్ గేమ్‌ ఛేంజర్‌ ఎక్కడి వరకు వచ్చిందంటే..!

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్ హీరోగా కియారా అద్వానీ( Kiara Advani ) హీరోయిన్‌ గా రూపొందుతున్న చిత్రం గేమ్‌ ఛేంజర్‌( Game changer movie ).ఈ సినిమా షూటింగ్‌ ఆ మధ్య శరవేగంగా జరిగింది.

 Ram Charan Game Changer Movie Update , Ram Charan, Upasana , Game Changer Movie-TeluguStop.com

కానీ ఉపాసన ( Upasana )బేబీకి జన్మనిచ్చిన సమయంలో చరణ్ బ్రేక్‌ తీసుకున్నాడు.తండ్రి అయిన ఆనందాన్ని ఆస్వాదించిన రామ్‌ చరణ్‌ ఈ మధ్య కాలంలో మళ్లీ గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్ లో పాల్గొన్నాడు.

మొన్నటి వరకు ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ చేసిన దర్శకుడు శంకర్‌ తిరిగి గేమ్‌ ఛేంజర్‌ లో అడుగు పెట్టబోతున్నాడు.

Telugu Dil Raju, Game Changer, Kiara Advani, Ram Charan, Shankar, Tollywood, Upa

మరో నలబై నుండి యాబై రోజుల వర్కింగ్‌ డేస్‌ తో సినిమా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.కానీ ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి కాక పోవడంతో సినిమాను సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సినిమా షూటింగ్‌ నేపథ్యం లో ప్రస్తుతం రామ్‌ చరణ్‌( Ram charan )ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ గేమ్‌ ఛేంజర్ ను ముగించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.దాంతో ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Telugu Dil Raju, Game Changer, Kiara Advani, Ram Charan, Shankar, Tollywood, Upa

అంతే కాకుండా సినిమా ఓ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసం కూడా వ్యక్తం అవుతోంది.ప్రస్తుతం జరుగుతున్న హడావిడి చూస్తూ ఉంటే కచ్చితంగా సినిమా అనుకున్న సమయంకు పూర్తి అయి వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు చేసే ఉద్దేశ్యం తో ఈ సినిమా ను తమిళం మరియు తెలుగు లో విడి విడిగా రూపొందిస్తున్నారు.అంతే కాకుండా భారీ ఎత్తున ఇతర భాషల్లో కూడా విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

పాన్‌ ఇండియా రేంజ్ లో పెద్దగా పోటీ లేని సమయంలో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube