తమిళ ఇండస్ట్రీ లో ( Kollywood ) స్టార్ హీరోలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ అక్కడ తలపతి గా పేరు పొందిన హీరో మాత్రం విజయ్( Vijay Thalapathy ) ఒకడే.అయితే విజయ్ ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన కి తమిళం లో సినిమాలు సక్సెస్ అయినట్టు గా తెలుగులో మాత్రం సక్సెస్ అవడం లేదు.
కారణం ఏంటి అంటే ఆయన యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులకి చాలా మంది కి నచ్చడం లేదు.ఇక ఆయన సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కూడా చాలా డిఫెరెంట్ గా ఉంటాయి అవి తెలుగు వాళ్ళని అలరించడం లో చాలా వరకు ఫెయిల్ అవుతూ ఉంటాయి…

ఇక తమిళం లో తన కంటే తక్కువ మార్కెట్ ఉన్న సూర్య( Surya ) కూడా తెలుగు టాప్ హీరో గా పేరు సంపాదించుకున్నాడు.ఆయన డైరెక్ట్ గా ఒక్క తెలుగు సినిమా చేయకపోయినా తెలుగు హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు… తమిళం లో చేసిన ఆయన సినిమాలు తెలుగులో డబ్ అయి సూపర్ సక్సెస్ సాధిస్తాయి… దీంతో తెలుగులో కూడా ఆయనకి మంచి మార్కెట్ ఏర్పడింది…

అయితే విజయ్ మాత్రం తెలుగు లో డబ్ చేసిన తన సినిమాల్లో ఒక్క తుపాకీ సినిమా( Tupaki Movie ) మాత్రమే సూపర్ సక్సెస్ అయింది ఇక మిగితా సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులని అలరించడం లో ఫెయిల్ అయ్యాయి.అయిన కూడా విజయ్ తెలుగు మార్కెట్ పెంచుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు.ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేస్తున్న లియో సినిమాతో( Leo Movie ) తెలుగు లో మార్కెట్ పెంచుకునే పని లో ఉన్నట్టు గా తెలుస్తుంది…ఇంతకు ముందు ఆయన డైరెక్షన్ లో చేసిన మాస్టర్ సినిమా తెలుగులో రిలీజ్ అయిన కూడా ప్రేక్షకులని పెద్దగా మెప్పించలేకపోయింది…కానీ ఇప్పుడు విక్రమ్ సినిమాతో లోకేష్( Lokesh Kanagaraj ) మార్కెట్ కూడా తెలుగు లో చాలా పెరిగింది దీంతో ఆయన మార్కెట్ తో అయిన విజయ్ ఈసారి తెలుగులో సక్సెస్ కొడతాడేమో చూడాలి…
.







