బీఆర్ఎస్ పాలనలో ప్రజల బతుకులు మారలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ మేలు జరగలేదని చెప్పారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలు అన్నీ బుట్టదాఖలు చేశారని తెలిపారు.
ఎన్నికల సమయంలో కొత్త పల్లవి ఎత్తుకుంటున్నారని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమం తప్పదన్నారు.మూడు దశలుగా బీజేపీ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ తో తాడో పేడో తేల్చుకుంటామని తెలిపారు.







