ఫలిస్తున్న రేవంత్ రెడ్డి వ్యూహాలు !

తెలంగాణలో ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) గట్టి ప్రయత్నలే చేస్తున్నారు.అయితే ఆ మద్య అంతర్గత విభేదాల కారణంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించిన పార్టీ సీనియర్ నేతలు ఇప్పుడు అన్నీ పక్కనబెట్టి కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు.

 Revanth Reddy Strategies Are Paying Off Details, Congress, Politics, Revanth Red-TeluguStop.com

దీంతో టి కాంగ్రెస్ లో( T Congress ) ప్రజెంట్ నయ జోష్ కనిపిస్తోంది.ఇదే జోష్ ను ఎన్నికల వరకు కొనసాగిస్తూ చేరికలపై దృష్టి కేంద్రికరించాలని హస్తంపార్టీ భావిస్తోంది.

కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత టి కాంగ్రెస్ లో చేరికలు బాగానే పెరిగాయి.

Telugu Chandrasekhar, Congress, Jupallikrishna, Ponguleti, Revanth Reddy-Politic

బి‌ఆర్‌ఎస్, బిజెపి పార్టీలలోని అసంతృప్త నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఇతర పార్టీల యొక్క నేతల చేరికతోనే పార్టీ బలం మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిన వారు తిరిగి పార్టీలో చేరాలని, పార్టీలో అందరికీ ప్రదాన్యం కలిపిస్తామని భరోసా ఇస్తున్నారు.

అంతే కాకుండా కొత్తగా పార్టీలో చేరేవారి ప్రజాధరణను బట్టి సీట్ల కేటాయింపు( Congress Tickets ) కూడా ఉంటుందని, కాబట్టి పార్టీలో చేరాలనుకునే వారు నిరభ్యంతరంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి.

Telugu Chandrasekhar, Congress, Jupallikrishna, Ponguleti, Revanth Reddy-Politic

ఫలితంగా బి‌ఆర్‌ఎస్( BRS ) మరియు బిజెపి( BJP ) పార్టీలలోని అసంతృప్త నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.బి‌ఆర్‌ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,( Ponguleti Srinivas Reddy ) జూపల్లి కృష్ణరావు( Jupalli Krishnarao ) ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు.ఇప్పుడు తాజాగా బిజెపిలోని సీనియర్ నేత కె.

చంద్రశేఖర్( K Chandrasekhar ) ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.ఇంకా ఈయన దారిలోనే మరికొంత మంది నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు టాక్.

మొత్తానికి ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించే విషయంలో రేవంత్ రెడ్డి వేస్తున్న వ్యూహాలు ఫలిస్తున్నాయనే చెప్పాలి.మరి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ వ్యూహాలు ఎంతవరు ఫలిస్తాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube