జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.పవన్ స్పీచ్ లో పూనకం, అరుపులు తప్ప ఏమీ ఉండదని విమర్శించారు.
విపక్ష పార్టీలన్నీ కలిసి కుట్రపూరితంగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని సజ్జల తెలిపారు.విశాఖలో పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఇందులో భాగంగానే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా చూపిస్తున్నారని ఆరోపించారు.ప్లాన్ ప్రకారం వైసీపీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
తమకు రాజ్యాంగం, చట్టాలు వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారన్న సజ్జల ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.ఏపీకి పట్టిన శని చంద్రబాబు అంటూ ధ్వజమెత్తిన సజ్జల వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు.
చంద్రబాబును గెలిపించాలనే పవన్ తపన అని వెల్లడించారు.
.






