ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ కి మంచి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్లలో శ్రీను వైట్ల( Director Srinu Vaitla ) ఒకరు ఆయన చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి నిజానికి ఈ సినిమాలు అన్ని.కూడా ఒకప్పుడు ఎనలేని హిట్ ను అందుకున్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన చేసిన సినిమాల మ్యాజిక్ ఎలాంటిదో అయితే ప్రస్తుతం ఆయన ప్లాపుల్లో ఉన్నారు కాబట్టి ఆయన కి ప్రస్తుతం ఒక హిట్ సినిమా కావాలి అందుకనే చాలా మంది హీరోలతో సినిమా తీయడానికి త్రీ చేస్తున్నప్పటికీ ఆయనకి ఈ హీరో కూడా అవకాశం ఇవ్వడం లేదు ఇక మంచు విష్ణు తో డీ సినిమా కి సీక్వెల్( Dhee Sequel ) స్టార్ట్ చేసినప్పటికీ అది కూడా మధ్యలోనే ఆగిపోయింది…
గతం లో ఆనందం, సొంతం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, దూకుడు వంటి ఎంటర్ టైనర్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీను వైట్ల కొంతకాలంగా దూకుడు తగ్గించాడు.2013 లో వచ్చిన ‘బాద్షా’( Baadshah ) తర్వాత ఆయన హిట్ చూడలేదు.ఈ పదేళ్లలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే తీసి, ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయిన ఆయన రేసులో బాగా వెనకబడిపోయాడు.
చివరిగా ఆయన దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని'(2018) అనే సినిమా వచ్చింది.ఆ తర్వాత ‘ఢీ’ సినిమాకి సీక్వెల్ చేయాలని అనుకున్నా ఎందుకనో అది సాధ్యం కాలేదు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ సినిమా ఉంటుందని ఆ మధ్య వార్తలొచ్చినా ఆ తర్వాత దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు.అయితే ఇప్పుడు మ్యాచో స్టార్ గోపీచంద్( Gopichand ) పేరు తెరపైకి వచ్చింది.

వీళ్లిద్దరి కాంబో లో ఒక సినిమా అయితే ఉంటుంది అనే టాక్ వినిపిస్తుంది…గోపిచంద్ కూడా ప్రస్తుతం ప్లపుల్లో ఉన్నాడు…నిజానికి 2014 లో వచ్చిన ‘లౌక్యం’ సినిమా తర్వాత ఆశించిన స్థాయిలో గోపీచంద్ విజయాలను అందుకోలేకపోయాడు.ముఖ్యంగా ఆయన గత చిత్రాలు ‘పక్కా కమర్షియల్’, ‘రామబాణం’ దారుణంగా నిరాశపరిచాయి.సరైన విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న గోపీచంద్ ప్రస్తుతం ‘భీమా’( Bhima Movie ) అనే సినిమా చేస్తున్నాడు.ఇదిలా ఉంటే తన తదుపరి సినిమాని శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
గోపీచంద్ మాస్ హీరో అయినప్పటికీ కామెడీతోనూ అదరగొడతాడు.వినోదాన్ని నమ్ముకొని ఆయన చేసిన ‘లౌక్యం’ మంచి విజయాన్ని అందించింది.

కామెడీలో దిట్ట అయిన శ్రీను వైట్ల తోనూ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ప్రియదర్శిని రామ్ కథ అందిస్తున్నట్లు వినికిడి.త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు… ఇక ఈ సినిమా ఒకవేళ స్టార్ట్ అవ్వకపోతే మరో కథ మరో యంగ్ హీరో కి కూడా చెప్పాడట శ్రీను వైట్ల ఆయన ఎవరంటే శర్వానంద్( Sharwanand ) నిజానికి శర్వా తో ఒక లవ్ స్టోరీ తీసే ప్లాన్ లో స్తిను వైట్ల ఉన్నట్లు గా తెలుస్తుంది…మరి వీరిద్దరిలో ఎవరు శ్రీను వైట్ల కి ఛాన్స్ ఇస్తారో చూడాలి…








