జగిత్యాల జిల్లాలో చిన్నారి కిడ్నాప్ యత్నం తీవ్ర కలకలం సృష్టించింది.ఇంటి బయట ఆడుకుంటున్న పాపను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది.
భీమారం మండలం మన్నెగూడెంలో ఘటన చోటు చేసుకుంది.అయితే పాపను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో కిడ్నాపర్లను చూసిన చిన్నారి తల్లి కేకలు వేసింది.
దీంతో నిందితులు అక్కడ నుంచి పరార్ అయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన విజువల్స్ సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.







