ఈ ప్రపంచంలో ప్రతి జీవివి తల్లి ప్రేమ అనేది ఉంటుంది.మనుషులకే కాదు జీవులు కూడా తమ పిల్లలను ప్రేమగా చూసుకుంటాయి.
పిల్లలపై తల్లి ప్రేమను చూపిస్తాయి.ఇక జీవి పిల్లలు కూడా తల్లి జీవిని కనిపెట్టుకుని ఉంటాయి.
పిల్లలకు జీవులు ఆహారం తెచ్చి పెట్టి అవి కాస్త పెరిగి పెద్దయ్యే వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటాయి.మిగతా జీవులు దాడి చేయకుండా ఎప్పుడూ పిల్లలను తమ దగ్గరే జీవులు ఉంచుకుంటాయి.
అయితే తాజాగా మొసళ్లకు( crocodiles ) సంబంధించి ఒక ఆశ్చర్యకర విషయం పరిశోధనల్లో బయటపడింది.

మనిషే కాదు.ఏ జీవి కనిపించినా టక్కున మింగేసే క్రూర జీవి అయిన మొసళ్లు కూడా శిశువుల ఏడుపును తల్లి కంటే ఎక్కువగా అర్ధం చేసుకుంటాయని ఒక రీసెర్చ్‌లో తేలింది.ఫ్రీక్వెన్సీలలోని( frequencies ) మార్పులపై ఆధారపడి దు:ఖాన్ని అర్థం చేసుకుంటాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.ఫ్రాన్స్‌లోని లియోన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు( University of Lyon in France ) తాజాగా మొసళ్లపై ఒక పరిశోధన చేపట్టారు.12 మంది మానవులు, ఆరు అడవి చింపాంజీలు, ఆరు క్యాస్టివ్ బోనోబోల ఏడుపును రికార్డ్ చేసి స్పీకర్ల ద్వారా మొసళ్లకు వినిపించారు.దీంతో ఏడుపును గమనించి అవి ప్రతిస్పందించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏడుపుకు మొసళ్లు ప్రతిస్పందించి లౌడ్ స్పీకర్లను( Loudspeakers ) సమీపించాయి.మూడింట ఒక వంతు మొసళ్లు మానవ శిశువులు, కోతుల ఏడుపులకు వేగంగా స్పందించాయట.ఆందోళనతోనే అవి సమీపిస్తున్నాయని, రక్త దాహంలో కాదని తాము భావిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మానవుల కంటే ఎక్కవగా ఏడుపులోని బాధను గుర్తిస్తున్నాయని తెలిపారు.నిజంగా పిల్లలు బాధలో ఉన్నారా? లేదా ఏదైనా హాని కలిగే అవకాశం ఉందా? అనేది కూడా మొసళ్లు చెప్పగలుగుతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.తల్లుల కంటే మొసళ్లే ఏడుపులోని బాధను వేగంగా గుర్తిస్తున్నట్లు చెబుతున్నారు.దీనిపై శాస్త్రవేత్తలు మరింతగా పరిశోధనలు జరుపుతుండగా.మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది.







