వారాహి యాత్ర :  అభిమానులకు రూల్స్ పెట్టిన జనసేన 

ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) విమర్శలు చేయడం, దానికి కౌంటర్ గా వైసిపి మంత్రులు, ఇతర నాయకులు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడం వంటి వ్యవహారాలతో ఏపీ రాజకీయం వేడెక్కింది.

ఈ వేడి ఇలా ఉండగానే పవన్ మూడో విడత వారాహి యాత్ర నేడు విశాఖ నుంచి ప్రారంభం కాబోతోంది.

మొన్నటి వరకు ఉభయగోదావరి జిల్లాలో మొదటి , రెండో విడత వారాహి యాత్రను పవన్ పూర్తి చేశారు.నేడు విశాఖలో ఈ యాత్ర సాగబోతోంది.

ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జగదాంబ జంక్షన్( Jagadamba Junction ) లో పవన్ రోడ్ షో నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి పవన్ ప్రసంగం చేయబోతున్నారు.

దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను జనసేన నాయకత్వం పూర్తి చేసింది.

Advertisement

 ఇక ఈ సభకు భారీగా జన సమీకరణ పైన దృష్టి సారించారు.ముఖ్యంగా శ్రీకాకుళం , విజయనగరం, పార్వతీపురం మన్యం,  విశాఖపట్నం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేపడుతోంది.పవన్ సభను సక్సెస్ చేయడం ద్వారా,  ఏపీ లో తామెంత బలంగా ఉన్నామో నిరూపించుకోవాలని జనసేన ప్రయత్నిస్తోంది.

ఇక పవన్ ఈరోజు గన్నవరం విమానాశ్రయం ( Gannavaram Airport )నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ కు చేరుకుంటారు.అక్కడి నుంచి కారులో పార్టీ కార్యాలయానికి వెళ్తారు.

ఆ తరువాత వారాహి వాహనంపై ర్యాలీగా జగదాంబ జంక్షన్ కు పవన్ చేరుకుంటారు.ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జగదాంబ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు.

అయితే ఈ సందర్భంగా భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం కొన్ని నియమ నిబంధనలు రూపొందించింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

వారాహి విజయ యాత్రలో( Varahi Vijaya Yatra ) గాని,  సభ వేదికల వద్ద కానీ , క్రేన్లతో పవన్ కళ్యాణ్ కు భారీ దండలు , గజమాలలు వేయవద్దని సూచించింది.అలాగే వ్యక్తిగత, భద్రతాపరమైన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరింది.వారాహి బస్సు యాత్ర సాగే మార్గంలో భారీ క్రేన్లు వాహనాలు ఏర్పాటు చేయడం వల్ల కాన్వాయ్ సాఫీగా సాగట్లేదు అని పార్టీ నాయకత్వం అభిప్రాయపడింది .ఈ తరహా చర్యల వల్ల సమయాన గుణంగా సభ వేదిక వద్దకు చేరుకోలేకపోతున్నామని , కాబట్టి ప్రతి జన సైనికుడు స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ పవన్ సభను సక్సెస్ చేసే విధంగా చూడాలని జనసేన విజ్ఞప్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు