వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) 200 రోజుల ఫంక్షన్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్లో మాటల దుమారం జరుగుతున్న విషయం తెలిసిందే.చిరంజీవి పెద్దమనిషి తరహాలో కొన్ని సూచనలు చేస్తే దానిపై మంత్రులు నానా యాగీ చేస్తూ చిరంజీవిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారంటూ కొన్ని వ్యాఖ్యలు వినిపింఛాయి .
అయితే తన వ్యాఖ్యలపై ఈ స్థాయి ప్రతిస్పందన చిరంజీవి ఊహించినదేనని ఒక సామాజిక వర్గాన్ని తన మాటలతో ప్రభావితం చేయగల చిరంజీవి( Chiranjeevi ) చేసిన వ్యాఖ్యల ప్రభుత్వం కూడా అంత సులువుగా తీసుకోదని ప్రతిదాడి చేస్తుందని ఊహించే చిరంజీవి ఆ విదంగా మాట్లాడారని రాజకీయ పరిశీలకులు విశ్లేసిస్తున్నారు .
ముఖ్యంగా రాజకీయాల్లో విఫలమైన అసంతృప్తి చిరంజీవిలో అలానే ఉండిపోయిందని తాను ఎన్నుకున్న ఏ రంగంలోనైనా నెంబర్ వన్ కి వెళ్ళటం అలవాటైన ఆయనకు రాజకీయాలను మధ్యలో వదిలేసాను అనే భావన ఉందని ఇప్పుడు తన తమ్ముడు ఆ స్థాయికి చేరడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నప్పుడు కనీస మద్దతు కూడా అందించకపోవడం తనకు అసంతృప్తి కలిగిస్తుందని 2024 ఎన్నికల్లో జనసేన( Jana sena 0 క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్న అంచనాలు ఉండటంతో తమ్ముడికి తన వైపు నుంచి మద్దతు ఇవ్వటం కోసమే చిరు వైసీపీను టార్గెట్ చేశారని 2024 ఎన్నికల్లో తన ప్రత్యక్ష మద్దతును కూడా అందించబోతున్నారంటూ ఒక విశ్లేషణ వినిపిస్తుంది
ముఖ్యంగా పవన్( Pawan kalyan ) వెంట తన సామాజిక వర్గానికి చెందిన యువత మాత్రమే వస్తుందని పెద్దలు ఆచి తూచి స్పందిస్తున్నారని తను గనక ప్రత్యక్ష మద్దతు అందించగలిగితే వారంతా పవన్ వెంట కదులుతారు అన్న ముందు ముందస్తు ఆలోచనతోనే చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఈ విశ్లేషణాల సారాంశం .అయితే అనేక సందర్భాల్లో రాజకీయాల ఎంట్రీ తన విముకత వ్యక్తం చేసిన చిరు మరొకసారి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారా అంటే కచ్చితంగా పవన్ కి ప్రత్యక్ష మద్దతు అయితే ఇస్తారని ఇలాంటి కీలకమైన సమయంలో కుటుంబ మద్దతు ఇవ్వకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుందని చిరు భావిస్తున్నారు అంటూ కూడా జనసేన వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.