తప్పుడు కేసులతో టీడీపీని అడ్డుకోలేరని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు.ప్రతీ చర్యకూ రేపు ప్రతిచర్య ఉంటుందన్నారు.
కార్యకర్తలు చిందించిన ప్రతి రక్తపు బొట్టుకూ సమాధానం చెప్తామని పేర్కొన్నారు.
పుంగనూరు, అంగళ్లులో దాడులకు ఉసిగొల్పింది సీఎం జగనేనని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
చంద్రబాబు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.వైసీపీ నేతలతో దాడులు చేయించి తిరిగి తమపై అక్రమంగా కేసులు బనాయించారని మండిపడ్డారు.







