ఒకప్పుడు సినిమాలు హిట్ అయితే సీక్వెల్స్( Sequels ) వచ్చేవి.కానీ ఇప్పుడు పరిస్థితి.
పద్దతి మారింది.ఇప్పుడు ఒకేసారి రెండు పార్ట్ లుగా సినిమాలను రూపొందిస్తున్నారు.
బాహుబలి సినిమా(Baahubali ) నుండి ఇది ఎక్కువ అయింది.సినిమా ను ఒక్క భాగంగానే రూపొందించాలని దర్శకుడు రాజమౌళి భావించాడు.
కానీ కథ ను రెండు భాగాల్లో చెప్తేనే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో తాను బాహుబలి 2 ను రెండు భాగాలుగా చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.ఆ తర్వాత రెండు భాగాలు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
దాంతో కేజీఎఫ్ ను కూడా రెండు భాగాలుగా తీసుకు వచ్చారు.పొన్నియిన్ సెల్వన్ ను కూడా రెండు భాగాలుగా తీసుకు వచ్చారు.
బ్రహ్మాస్త్ర సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని భావించారు.

ఇక సలార్ సినిమా ను( Salaar ) రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకుని మొదటి భాగం ను సెప్టెంబర్ లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.ఇక కోలీవుడ్ లో కూడా రెండు భాగాల హడావుడి మొదలు అయినట్లుగా తెలుస్తోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న లియో సినిమాను( Leo Movie ) రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు.

రెండు భాగాలుగా వచ్చిన సినిమాల్లో కొన్ని నిరాశ పరచగా కొన్ని మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.బాలయ్య ‘ఎన్టీఆర్’ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఆ తర్వాత మరి కొన్ని సినిమాలు కూడా రెండు భాగాలుగా అంటూ వచ్చి మిశ్రమ స్పందన దక్కించుకున్నాయి.కథ విషయంలో దర్శకుడు రాజీ పడకుండా రెండు భాగాల్లో తాను చెప్పాలి అనుకున్న పూర్తి కథ ను చెప్పే అవకాశం ఉంటుంది.
అలాగే రెండు భాగాల్లో సినిమా ను తీసుకు వస్తే ఒక్క సినిమా కు అయ్యే ఖర్చుతో డబుల్ లాభం దక్కుతుంది.కనుక ఈ మధ్య కాలంలో రెండు భాగాల సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.







