టీడీపీ జనసేన మద్య ఏమైంది ?

టీడీపీ( TDP party ) మరియు జనసేన పార్టీ( Janasena party )ల మద్య పొత్తు ఉంటుందని వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి వెళ్ళడం దాదాపు ఖాయమని నిన్న మొన్నటి వరుకు వార్తలు వినిపించాయి.ఈ రెండు పార్టీల అధినేతలు కూడా పొత్తుపై చాలా వరకు క్లారిటీ ఇచ్చారు కూడా.

 What Happened Between Tdp Janasena, Tdp Party, Janasena Party, Brs Party, Ap Pol-TeluguStop.com

కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రెండు పార్టీల మద్య పొత్తు కుదిరే పరిస్థితి కనిపించడంలేదు.అటు పవన్ గాని ఇటు చంద్రబాబు( Chandrababu Naidu ) గాని మీకు మీరే మాకు మేమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఆ మద్య జరిగిన ఎన్డీయే కూటమి సమావేశం తరువాత రెండు పార్టీల మద్య చాలానే మార్పు కనిపించింది.ఆ సమావేశానికి టీడీపీ పార్టీకి ఆహ్వానం అందకపోవడం, జనసేన పార్టీకి మాత్రమే ఆహ్వానం అందడంతో జనసేన బీజేపీ( BJP party ) పార్టీల మద్య మాత్రమే పొత్తు అనే విషయం తేలిపోయింది.</br/

Telugu Ap Poolitics, Chandrababu, Janasena, Pawan Kalyan-Politics

దానికి తోడు టీడీపీ బీజేపీ మద్య సమస్యలు ఉన్నాయని స్వయంగా పవనే చెప్పడంతో ఆ రెండు పార్టీలు కలవడం కష్టమే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి.అయితే ఎన్నికల్లో బీజేపీతో కంటే టీడీపీతో కలవడమే బెటర్ అని ఆ మద్య పవన్ భావించినప్పటికి.ప్రస్తుతం మాత్రం బీజేపీతో మాత్రమే తమ దోస్తీ అని పవన్ చెప్పకనే చెబుతున్నారు.దీంతో ఇటు జనసేన, అటు టీడీపీ పొత్తుపై క్లారిటీ ఇవ్వకుండానే అభ్యర్థుల ప్రకటనపై దృష్టి పెట్టడంతో ఇక పొత్తు లేనట్లే అనే వాదన వినిపిస్తోంది.

ఆ మద్య పవన్ తెనాలి నియోజిక వర్గానికి నాదెండ్ల మనోహర్ పేరును ప్రస్తావించి మొదటి అభ్యర్థిని బహిర్గతం చేశారు.

Telugu Ap Poolitics, Chandrababu, Janasena, Pawan Kalyan-Politics

ఇప్పుడు టీడీపీ కూడా మెల్లగా అభ్యర్థుల ప్రకటనపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.పల్నాడు జిల్లాలోని గురజాల నియోజిక వర్గానికి యరపతినేని శ్రీనివాసరావు ( Yarapathineni Srinivasarao )ను అభ్యర్థిగా ప్రకటించారు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్.ఇక ఇదే విధంగానే రెండు పార్టీలు మెల్లగా నియోజిక వర్గాల వారీగా అభ్యర్థుల ప్రకటనకు శ్రీకారం చూస్తున్నారు పవన్, చంద్రబాబు.

దీంతో నిన్న మొన్నటి వరకు పొత్తు కోసం తాపత్రయ పడిన ఈ ఇద్దరు అధినేతలు ఇప్పుడు ఎవరికి వారే అభ్యర్థుల ప్రకటన చేస్తుండడం కొంత ఆశ్చర్యకరమే.అయితే ఈ రెండు పార్టీయ మద్య ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఓ స్పష్టత లేనందువల్లే పొత్తు విషయంలో టీడీపీ జనసేన వెనుకడుగు వేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మరి ఎన్నికల సమయానికి ఈ రెండు పార్టీల మద్య ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube