గత కొన్ని నెలలుగా గాలిమాట గా వినిపిస్తున్న ఈ వార్త ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.చర్చలు తుది రూపుకు వచ్చాయని వచ్చే తెలంగాణ ఎన్నికల లో అదికారం లోకి వచ్చే సత్తా కాంగ్రెస్కే ఉందని షర్మిలకు నమ్మకం వచ్చిందని, అందువల్ల కాంగ్రెస్తోనే కలిసి నడవాలని ఆమె నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.
ఈ దిశగా కర్ణాటక కాంగ్రెస్( Karnataka Congress ) ఫైర్ బ్రాండ్ డీకే శివకుమార్తో ఆమె తుది చర్చలు జరుపుతున్నారని, ఒకటి రెండు రోజుల్లో ఆయనతో కలిసి వెళ్లి సోనియా గాంధీతో సమావేశం అవుతారని, ఈ వారం చివరికల్లా షర్మిల పార్టీ విలీన ప్రకటన వస్తుందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే భాజపాను పక్కకు తోసి ప్రధాన ప్రతిపక్షంగా నిలబడిన కాంగ్రెస్ ఇప్పుడు షర్మిల( Sharmila ) పార్టీని కూడా విలీనం చేసుకుంటే తమకు రాజకీయంగా కలిసి వస్తుందని భావిస్తున్నట్లుగా సమాచారం తెలంగాణ ఎన్నికలలో ప్రచారం వరకు ఆమెను వాడుకొని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే ఉద్దేశంలో కాంగ్రెస్( Congress ) హై కమాండ్ ఉందని వార్తలు వస్తున్నాయి ఇంతకాలం ఆంధ్ర లో రాజకీయాలకు షర్మిల అంగీకరించకపోయినప్పటికీ మారుతున్న పరిస్థితులలో సర్దుకుపోక తప్పదని తెలంగాణ రాజకీయాల్లో ఎంత ప్రయత్నించినా ఆశించిన ఆదరణ దక్కకపోవడంతో ఆంధ్ర రాజకీయాలలో కూడా ప్రయత్నించి చూద్దామన్న ఆలోచన కు షర్మిల వచ్చారని అందువల్ల పూర్తిస్థాయి కాంగ్రెస్ నాయకురాలుగా మారటానికి ఆమె సిద్దమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh ) లో కాంగ్రెస్ ను తిరిగి బ్రతికించడం సాద్యం కాదని పై ఆంధ్ర లో కాంగ్రెస్ ను అంతర్దానం చేసినది స్వయానా తన అన్న పెట్టిన వైసీపీ కావడంతో కాంగ్రెస్ను బలపరచాలంటే అక్కడ వైసిపిను( YCP ) బలహీనపరచాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే రెండు పార్టీల కామన్ ఓటు బ్యాంకు ఒకటే కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో అన్నతో తలపడడానికి షర్మిల ఎంత మేరకు అంగీకరిస్తారు అన్నదే పెద్ద ప్రశ్న.రి ఆమె కనక ఆంధ్ర రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తే కనుక రాజకీయ సమీకరణాలు మరింత వేడెక్కుతాయ్ అనడంలో మాత్రం సందేహం లేదు.







