మనిషి మనుగడకు తాగునీరు( Drinking Water ) ఎంతో అవసరం.నీరు లేనిది మనిషే కాకుండా సమస్త జీవ కోటి లేదు.
మంచి నీరు తాగే పద్ధతిలో తాగితేనే అది ఆరోగ్యానికి మంచిది.లేదంటే అది కూడా అనారోగ్యమే అని నిపుణులు చెబుతున్నారు.
అందుకే అన్నం తినేటప్పుడు నీరు తాగే పద్ధతిలో చాలామందికి ఎన్నో రకాల సందేహాలు ఉన్నాయి.భోజనానికి ముందు నీరు తాగితే అనారోగ్యం అనే కొందరు చెబుతూ ఉంటే, భోజనం తర్వాత తాగితే ఇబ్బంది కలుగుతుందని మరికొందరు చెబుతున్నారు.
ఇంతకీ అసలు వాస్తవం ఏమిటి? హెల్త్ కేర్ ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనానికి ముందు నీరు తాగడం( Drinking Water Before Meal ) వల్ల కలిగే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయి.ఇది శరీరానికి తగినంత నీరు సరఫరా చేసి శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది.అంతే కాకుండా భోజనానికి ముందు తాగే నీరు పొట్టలో జీర్ణ వ్యవస్థ( Digestion )ను మెరుగుపరుస్తుంది.
మనం భోజనానికి ముందు నీరు తాగినప్పుడు పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.ఫలితంగా అతిగా తిని స్థూలకాయం తెచ్చుకునే ప్రమాదం ఉండదు.అందుకే భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీరు తాగితే మంచిదే అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
భోజనం చేసేటప్పుడు నీరు తాగడం( Drinking Water During Meal ) వల్ల ఆహారం మింగడం తేలిక అవడంతో పాటు తేలిగ్గా జీర్ణం అవుతుంది అని చాలామంది చెబుతూ ఉంటారు.కానీ వాస్తవానికి భోజనం చేసేటప్పుడు అధిక మొత్తంలో నీరు తాగితే పొట్టలో ఆహారాన్ని అరిగించేందుకు ఉపయోగపడే డైజెస్టివ్ ఎంజమ్స్( Digestive Enzymes ) ఆమ్లాలు పల్చబడి జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది.భోజనం మింగుడు పడడం కోసం లేదా గొంతు నోరు మారకుండా ఉండడం కోసం చిన్న చిన్న గా నీరు తాగుతూ ఉండాలి.
భోజనం తర్వాత నీరు తాగడం( Drinking Water After Meal ) వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి.నోట్లో దంతాల మధ్య మిగిలిన ఆహార కణాలను తొలగించి నోటిని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు దంతాల్లో పీప్పి రావడం వంటి సమస్యలు దూరం అవుతాయి.
అన్నం తిన్న తర్వాత నీళ్లు తాగడం వలన జీర్ణ వ్యవస్థ సాఫీగా జరిగి మలబద్ధకాన్ని నివారిస్తుంది.