మణిపూర్ అంశంపై గత కొన్ని రోజులుగా అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే విపక్షాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు.
ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు అవిశ్వాసంపై చర్చ జరగనుంది.ఇందులో భాగంగానే లోక్ సభలో చర్చను కాంగ్రెస్ ఎంపీ ప్రారంభించారు.
ఈ క్రమంలోనే మణిపూర్ లో బాధితులకు న్యాయం జరగాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కోరారు.మణిపూర్ లో మహిళలు, యువకులు, విద్యార్థులు న్యాయం కోరుతున్నారని చెప్పారు.
మణిపూర్ గురించి ప్రధాని మోదీ మాట్లాడాలని కోరుకుంటున్నామని తెలిపారు.దీనిపై ఎంతమంది మాట్లాడినా ప్రధాని మాట్లాడితే వేరేగా ఉంటుందని వెల్లడించారు.







