రాజన్న సిరిసిల్ల జిల్లా: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఈ పర్యటన భాగంగా ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు లతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
పర్యటన వివరాలు:
ఉదయం 10 గంటలకు వేములవాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నంది కమాన్ జంక్షన్ ను ప్రారంభిస్తారు.ఉదయం 10:30 గంటలకు చింతలతండా గ్రామపంచాయతీలో నూతనంగా ఏర్పాటుచేసిన 42 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారు.ఉదయం 11 గంటలకు జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్, డి ఈ ఐ సి సెంటర్, మాతృసేవా సెంటర్ ను ప్రారంభిస్తారు.
ఉదయం 11:15 గంటలకు జిల్లా ఆసుపత్రి ఆవరణంలో బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభిస్తారు.ఉదయం 11:30 గంటలకు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు మూల వాగు వద్ద అత్యాధునిక అంగులతో ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్ ను ప్రారంభిస్తారు.మధ్యాహ్నం 12:30 గంటలకు శ్యామకుంట జంక్షన్ వద్ద వెజ్ మార్కెట్ ను ప్రారంభిస్తారు.మధ్యాహ్నం 12:45 గంటలకు గుడి చెరువు అభివృద్ధి పనులకు, శివార్చన స్టేజికి శంకుస్థాపన చేస్తారు.మధ్యాహ్నం 1 గంటలకు బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
మద్యాహ్నం 1:30 గంటలకు భక్తుల సౌకర్యార్థం 100 గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లంచ్.
మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ బందు పథకంలో భాగంగా 600 మందికి చెక్కులను పంపిణీ చేస్తారు.