ప్రజా గాయకుడు గద్దర్ భౌతికకాయాన్ని హైదరాబాద్ అల్వాల్ లోని నివాసానికి తరలించారు.ఈ క్రమంలో ఆయన భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
భూదేవి నగర్ మహాబోధి స్కూల్ ఆవరణలో గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి.కాగా గద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు మరికాసేపటిలో సీఎం కేసీఆర్ రానున్నారు.
అనంతరం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
గద్దర్ మృతితో యావత్ తెలంగాణ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది.