క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ మరొకటి వచ్చింది.చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్‌కు రంగం సిద్దమవుతోంది.
అన్ని దేశాల క్రికెట్ లెజెండ్స్ మరోసారి మైదానంలోకి అడుగుపెట్టి ప్రేక్షకులను అలరించనున్నారు.సీనియర్ క్రికెటర్లు అందరూ తమ ఆటతో మళ్లీ మైమరిపించనున్నారు.
తమ ఆటతో క్రికెట్‌కే వన్నె తెచ్చి ఆటగాళ్లు అందరూ మరోసారి పొట్టి ఫార్మాట్‌లో పోటీ పడనున్నారు.ఇందులో పాకిస్తాన్ జట్టుతో టీమిండియా తలపడనుంది.

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు రోడ్ సేప్టీ పేరుతో టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ప్రతి ఏడాది టీ 20 ఫార్మాట్ లో ఈ టోర్నీ జరుగుతూ ఉంటుంది.అన్ని దేశాల సీనియర్ క్రికెటర్లు, రిటైర్మెంట్ అయిన క్రికెటర్లు ఇందులో పాల్గొంటారు.రోడ్ సేఫ్టీ మూడో సీజన్ కు ఇప్పుడు రంగం సిద్దమైంది.గత రెండు సీజన్లు భారత్ వేదికగా జరిగాయి.అయితే ఇప్పుడు మూడో సీజన్ ఇంగ్లండ్ వేదికగా జరగనుంది.
గత రెండు సీజన్లు భారత్ లొ జరగడం, భారత్ తొ పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో పాకిస్తాన్ ఈ టోర్నీలో పాల్గొనలేదు.

కానీ ఈ సారి ఇంగ్లండ్( England ) లో జరగనుండటంతో పాకిస్తాన్ జట్టు కూడా పాల్గొనుంది.పాకిస్తాన్ లెజెండ్స్ పేరుతో పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు.దీంతో దీని ద్వారా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ను ప్రేక్షకులు చూడవచ్చు.
మొత్తం 9 జట్లు ఈ టోర్నీలో పాల్గొనున్నాయి.త్వరలోనే టోర్నీ షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు.
అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది.దీంతో సెప్టెంబర్ తొలివారంలో రోడ్ సేఫ్టీ టోర్నీని నిర్వహించాలని చూస్తున్నారు.
కేవలం మూడు వారాల్లో ఈ మ్యాచ్ లు ముగియనున్నాయి.ఈ టోర్నీలో ఇండియన్ లెజెండ్స్ టీమ్ కు సచిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.
యువరాజ్, సెహ్వాగ్, జహీర్ ఖాన్ వంటి ఆటగాళ్లు ఆడుుతున్నారు.







