ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అదుపుతప్పిన బైక్ లారీ కిందకు దూసుకెళ్లిందని తెలుస్తోంది.
జంగాలపల్లిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.మరొకరు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.
గమనించిన స్థానికులు బాధిత వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.