నందమూరి హీరో కళ్యాణ్ రామ్( Nandamuri Hero Kalyan Ram ) టాలీవుడ్ హీరోల్లో ఒకరు.అయితే ఈయన తన తమ్ముడు లాగా వరుస హిట్స్ అందుకోలేక పోతున్నాడు.
ఒకపక్క ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోగా కళ్యాణ్ రామ్ మాత్రం ఒక్క హిట్టు కోసం పరితపిస్తున్నాడు.అయితే ఇది నిన్నటి వరకు మాట.ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా అదిరిపోయే హిట్ కొట్టాడు.

కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార( Bimbisara ) మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా ‘బింబిసార’ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు.
ఈ సీక్వెల్ పక్కన పెట్టి మళ్ళీ తన సినిమాలతో బిజీగా ఉన్నాడు.బింబిసారా నుండి ప్రయోగాత్మక సినిమాలను చేస్తూ వస్తున్నాడు.
ఇటీవలే అమిగోస్ సినిమా( Amigos Movie )తో వచ్చి పర్వాలేదు అనిపించుకున్నాడు.ఇక ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు.‘డెవిల్'( Devil ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.టీజర్ తో సాలిడ్ బజ్ ను అందుకున్న ఈ సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతుంది.
ఒక ప్రముఖ స్పై జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే డీసెంట్ బజ్ నెలకొంది.

ఇక ఈ సినిమాను నవీన్ మేడారం( Naveen Medaram ) డైరెక్ట్ చేస్తుండగా తాజాగా రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ప్రకటించారు.ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కారణంగా లెట్ అవుతూ వచ్చింది.తాజాగా ఈ సినిమాను నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా.ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.







