ప్రతి ఒక్కరి జీవితంలో సెంటిమెంట్లకు( Sentiments ) ప్రత్యేక స్థానం ఉంటుంది.పాజిటివ్ సెంటిమెంట్లను ఫాలో అయితే మంచి జరుగుతుందని నెగిటివ్ సెంటిమెంట్లు రిపీట్ అయితే చెడు జరుగుతుందని చాలామంది భావిస్తారు.
కెరీర్ తొలినాళ్లలో అచ్చొచ్చిన సెంటిమెంట్లు తర్వాత కాలంలో నెగిటివ్ గా మారిన సందర్భాలు సైతం ఉంటాయి.రవితేజ( Raviteja ) సినీ కెరీర్ విషయానికి వస్తే న అనే అక్షరంతో రవితేజ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు షాకిచ్చాయి.
ఈ సినిమాలలో కొన్ని సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయినా ఆ సినిమాలలో రవితేజ హృదయాన్ని హత్తుకున్న సినిమాలు సైతం ఉన్నాయి.నీకోసం సినిమాతో అటు రవితేజ ఇటు శ్రీనువైట్లకు మంచి పేరు వచ్చింది.
ఈ సినిమా మంచి లాభాలను అందించింది.న అక్షరం సెంటిమెంట్ ఈ సినిమా విషయంలో కలిసొచ్చినా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్( Naa Autograph Sweet Memories ) సినిమా విషయంలో కలిసిరాలేదు.

ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకులకు నచ్చినా రిలీజైన సమయంలో పెద్దగా కలెక్షన్లు రాలేదు.ఈ సినిమా ఫలితం రవితేజను హర్ట్ చేసింది.రవితేజ పూరీ జగన్నాథ్ ఎంతో ఇష్టపడి నేనింతే సినిమా( Neninthe ) చేయగా కమర్షియల్ గా ఈ సినిమా కూడా మరీ భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకోలేదు.న అక్షరంతో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాలనే మిగిల్చింది.
నిప్పు( Nippu ) టైటిల్ తో రవితేజ గుణశేఖర్ కాంబోలో తెరకెక్కిన మూవీ మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు.

దీక్షా సేథ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నిర్మాతలకు దిమ్మతిరిగే షాకిచ్చింది.రవితేజ కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో నేల టికెట్ సినిమా( Nela Ticket Movie ) తెరకెక్కగా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.రవితేజ నాగ్ హీరోగా తెరకెక్కిన నిన్నే పెళ్లాడతా సినిమాలో చిన్న పాత్రలో నటించినా ఆ సినిమాలో నాగ్ మెయిన్ హీరో అనే సంగతి తెలిసిందే.
అందువల్ల న సెంటిమెంట్ ను ఈ సినిమా విషయంలో పరిగణనలోకి తీసుకోవడం లేదు.







