మెగా ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య అనుబంధం ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎప్పటికప్పుడు ఏదో ఒక ఈవెంట్ ద్వారా వీరి మధ్య ఉన్న అనుబంధం బయటపడుతూనే ఉంటుంది.
అయితే మొదటిసారి పవన్ కళ్యాణ్ చిరంజీవి ( Chiranjeevi ) ని ఆ విషయంలో ఎదిరించారట.మరి ఆ విషయం ఏంటంటే.
చిన్నప్పటినుండి పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) కి చదువు మీద గానీ, సినిమాల మీద గాని అస్సలు ధ్యాస ఉండేది కాదు.ఆయన ఎప్పుడూ కూడా బుక్స్ చదువుతూ కాలక్షేపం చేసేవాడు.
అంతే కాదు ఏదో ఒక చిన్న జాబ్ చేస్తూ వ్యవసాయం చేయాలని ఆయనకు కోరిక ఉండేదట.కానీ చిరంజీవి హీరో అయ్యాక తన తమ్ముడిని కూడా ఎలాగైనా హీరో చేయాలని భావించాడు.

అలా చూస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కి కూడా సినిమాల మీద మక్కువ పెరిగింది.పవన్ కళ్యాణ్ కోసం కథలు వెతుకుతున్న టైంలో చాలామంది దర్శకులు చిరంజీవికి కథలు చెప్పారట.అయితే ఇందులో ఏ కథ కూడా చిరంజీవి ( Chiranjeevi ) కి నచ్చకపోవడంతో అన్నింటిని రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారట.అయితే చిరంజీవి అలా కథలన్నీ రిజెక్ట్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఓ రోజు కోపంతో అసలు ఏంటి అన్నయ్య నా పరిస్థితి.
ఇలా ఎన్ని రోజులు కథలు రిజెక్ట్ చేసుకుంటూ నేను ఇలా తిరగాలి.ఈ తొక్కలో సినిమాలు నేను చేయకపోయినా పర్వాలేదు.అసలు నాకు హీరోగా చేయాలని కోరిక కూడా లేదు.నాకు సినిమా వద్దు ఏదీ వద్దు సన్యాసం తీసుకుని బౌద్ధమతం లోకి వెళ్తాను అంటూ మాట్లాడారట.
అంతేకాదు ఆ మరునాడే పవన్ కళ్యాణ్ ఇంటి నుండి పారిపోయి మద్రాస్ వెళ్లారట.

కానీ ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తమ్ముడు ఎక్కడ ఉన్నాడో వెతికించి మరీ ఇంటికి తీసుకువచ్చి నీకు ఒక మంచి కథ వచ్చేవరకు నువ్వు ఇంట్లోనే ఉండాలి.బయటికి ఎక్కడికి పోకూడదు అంటూ ఓ రూమ్ లో వేసి లాక్ చేశారట.అంతేకాదు పవన్ కళ్యాణ్ ఎటూ వెళ్లకుండా నాగబాబు ( Nagababu ) ని కాపలా పెట్టారట.
ఇలా మొదటిసారి చిరంజీవిని పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఎదిరించారట.ఇక ఆ తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ( Akkada ammayi ikkada abbayi ) సినిమాతో పవన్ కళ్యాణ్ ని టాలీవుడ్ కి పరిచయం చేశారు చిరంజీవి.
ఇక అప్పటి నుండి ఇప్పటివరకు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు.







