ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ల హవా నడుస్తోంది.ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లకు పోటీగా తమ అందచందాలను ఆరబోస్తూ ఇండస్ట్రీలో అమ్మ,అత్త, విలన్ పాత్రల్లో అదరగొడుతున్నారు.
అలాంటి వారిలో ఒకప్పటి హీరోయిన్స్ అయినా రమ్యకృష్ణ,రాధిక, మీనా, నదియా, కుష్బూ,టబూ (Tabu) వంటి హీరోయిన్స్ ఉన్నారు.ఇక వీరందరిలో ఎక్కువ క్రేజ్ ఉంది మాత్రం రమ్యకృష్ణ ( Ramyakrishna )కు.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటినుండి ఇప్పటివరకు కొంచెం కూడా తన క్రేజ్ తగ్గించుకోకుండా ఐదు పదుల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతోంది.ఇప్పటికే పలు ప్రాజెక్టుల్లో పని చేస్తూ ఒక రోజుకి ఏకంగా 10 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ కీలక పాత్రల్లో నటిస్తోంది.
అయితే అలాంటి రమ్యకృష్ణ కోసం ఓ ఇద్దరు స్టార్ హీరోలు కొట్టుకున్నారట.
వాళ్ళు ఎవరో కాదు యంగ్ హీరోలకు పోటీగా ప్రస్తుతం సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో స్టార్స్ గా ఉన్న చిరంజీవి ( Chiranjeevi ) నాగార్జున.అయితే నాగార్జున చిరంజీవి మధ్య రమ్యకృష్ణ గురించి గొడవ ఎందుకు వచ్చింది అని మీరు అనుమానపడవచ్చు.అయితే అసలు విషయం ఏమిటంటే.
మన టాలీవుడ్ ఇండస్ట్రీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గతంలో వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఇక ఈ వేడుకల్లో ప్రతి ఒక్క నటీనటులు పాల్గొన్నారు.ఇందులో సుమ ( Suma ) యాంకర్ గా చేసింది.అయితే సుమ పక్క పక్కనే కూర్చునే ఉన్న చిరంజీవి నాగార్జున దగ్గరికి వెళ్లి వారి మధ్య ఫన్నీగా ఒక గొడవ సృష్టించింది.
వారి పక్కనే కూర్చున్న రమ్యకృష్ణ దగ్గరకు వెళ్లి మీకు ఈ ఇద్దరిలో ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం అని అడిగింది.అయితే ఆ ఆన్సర్ చెప్పలేక రమ్యకృష్ణ సతమతమయింది.
ఇక రమ్యకృష్ణ చెప్పేలోపే చిరంజీవి రమ్య కృష్ణ కి నేనంటే చాలా ఇష్టం అని అంటే లేదు లేదు రమ్యకి నేనంటేనే ఎక్కువ ఇష్టం అంటూ నాగార్జున మధ్యలోకి వచ్చారు.ఇక నాగార్జున ( Nagarjuna ) రమ్య నాతో చాలా సినిమాల్లో జోడి కట్టింది అని అంటే మీతో కేవలం సినిమాలు చేస్తే నాతో గొప్ప గొప్ప సినిమాల్లో నటించింది అన్నట్టుగా వీళ్ళిద్దరూ కాసేపు ఫన్నీగా గొడవ పెట్టుకున్నారు.
ఇలా రమ్యకృష్ణ కారణంగా వజ్రోత్సవ వేడుకల్లో నాగార్జున చిరంజీవి ఫన్నీగా గొడవ పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.