నాకు ఉన్న ఆస్తులు అవి మాత్రమే.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్( Powerstar Pawan Kalyan ) నటించిన బ్రో మూవీ గత వారం థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.అయితే ఈ సినిమా గురించి, ఈ సినిమా వివాదాల గురించి, తన ఆస్తుల గురించి, తన పారితోషికం గురించి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో క్లారిటీ ఇవ్వగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

 Pawan Kalyan Sensational Comments About His Assets Value Details Here Goes Viral-TeluguStop.com

బ్రో సినిమా( Bro Movie )ను నేను ఎప్పుడో వదిలేశానని పవన్ అన్నారు.

షూట్ చేశానని డబ్ చేశానని ఫంక్షన్ కు హాజరైన తర్వాత ఆ మూవీని వదిలేశానని పవన్ పేర్కొన్నారు.వైసీపీ నేతలు( YCP Leaders ) మాత్రం ఆ సినిమాను ఇంకా వదల్లేదని జనసేన నేతలు ఆ ఉచ్చులో పడవద్దని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.నా సమస్య బ్రో మూవీ కాదని ఆ సినిమాకు సంబంధించి వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల ఉచ్చులో నువ్వు పడవద్దని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

వైసీపీ నేతలు బ్రో మూవీ గురించి ఆరోపణలు చేస్తే మీరు నిజమైన సమస్యల గురించి మాత్రమే స్పందించాలని పవన్ కళ్యాణ్ అన్నారు.సినిమా అనే నాకు అవసరమని పార్టీ నడపటానికి నాకు ఇంధనం సినిమా అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

సినిమా అనే ఇంధనాన్ని నేను పార్టీ కోసం, ప్రజల కోసం ఉపయోగిస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు.సినిమాపై నాకు ప్రేమ ఎక్కువగా ఉండదని తక్కువగా ఉండదని పవన్ పేర్కొన్నారు.

జనసేన నాయకులు( Janasena Leaders ) సినిమాను రాజకీయాల్లోకి తీసుకొనిరావద్దని ఆయన వెల్లడించారు.నేను పార్టీ ఆఫీస్ లో వెనుక ఉండే చిన్న రూమ్ లో ఉంటానని ఆయన వెల్లడించారు.నాకు ఆస్తులు లేవని 5 6 బీరువాల పుస్తకాలు, 2, 3 బ్యాగుల బట్టలు, బ్యాగులో నాకు కావాల్సిన వస్తువులు, ఇదే నా సొత్తు అని పవన్ వెల్లడించారు.పవన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube