లోకేష్ ,చంద్రబాబు భద్రతపై హోంశాఖ స్పెషల్ ఫోకస్ ? 

టీడీపీ అధినేత చంద్రబాబు( N.Chandrababu Naidu ),  ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రతపై కేంద్ర హోం శాఖ ప్రత్యేకంగా ఆరా తీస్తోంది.ఇటీవల కాలంలో చంద్రబాబు పర్యటనలో అపశృతులు దొర్లుతూ ఉండడం, భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తుండడం వంటి అన్ని విషయాలను చాలా సీరియస్ గా తీసుకుంది .చంద్రబాబు లోకేష్ భద్రత విషయంలో పోలీసులు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది .ఈ మేరకు లోకేష్ , చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతపై తక్షణమే నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ,  డిజిపి కి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.

 Home Department Special Focus On Security Of Lokesh And Chandrababu, Cbn, Chand-TeluguStop.com

దీంతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

Telugu Ap, Chandrababu, Lokesh, Nsg Commando, Ysrcp-Politics

వాస్తవంగా జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబు పై ఇటీవల కాలంలో జరిగిన దాడులపై కేంద్ర హోంశాఖ తీవ్ర ఆగ్రహంగా ఉంది.అలాగే లోకేష్ పాదయాత్ర( Nara lokesh )కు కల్పిస్తున్న భద్రత వివరాలను వెంటనే సమర్పించాలని హోంశాఖ ఆదేశించింది.నవంబర్ 4వ తేదీన చంద్రబాబు ర్యాలీపై రాళ్లదాడి ఘటన పైన నివేదిక కోరింది.

అలాగే లోకేష్,  చంద్రబాబు పర్యటనల్లో భద్రత కల్పించాలని డీజీపి , చీఫ్ సెక్రటరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.జులై 27న ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.

దీనిపై ఏపీ ప్రభుత్వం ఎటువంటి వివరణ ఇవ్వకుండానే , పుంగనూరులో చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జరగడం, ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం,  తరుచుగా చంద్రబాబు జనాల్లో తిరుగుతూ పర్యటనలు చేస్తున్నారు.ఆ పర్యటనల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం,  కొంతమంది చంద్రబాబు పై దాడికి ప్రయత్నించే అవకాశం ఉండడం,  తదితర అన్ని అంశాల పైన కేంద్ర హోమ్ శాఖ దృష్టి సారించింది.

Telugu Ap, Chandrababu, Lokesh, Nsg Commando, Ysrcp-Politics

ఈ మేరకు చంద్రబాబు సెక్యూరిటీని రివ్యూ చేసిన ఎన్ఎస్ జీ కొత్తగా మరో 20 మంది కమాండోలతో భద్రత కల్పించాలని నిర్ణయించారు.అప్పటి వరకు ఆయనకు ఉన్న జెడ్ ప్లస్ కేటగిరి నిబంధనల ప్రకారం షిఫ్ట్ కు ఎనిమిది మంది భద్రత కల్పించేవారు.అయితే ఏడాది నుంచి వారి సంఖ్యను మరో 20 మందికి పెంచారు.అప్పటివరకు డీఎస్పీ ర్యాంక్ అధికారి పర్యవేక్షణలో ఆయన భద్రత ఉండేది .ఏడాది నుంచి డిఐజి స్థాయి అధికారి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.ఏపీలో రాజకీయ పరిస్థితులు గందరగోళంగా ఉండడం, చంద్రబాబు,  లోకేష్ లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ స్థాయిలో హోంశాఖ సృష్టి సారించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube