హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలు డైరెక్ట్ చేసి డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సాయి రాజేష్( Sai Rajesh ) ఇప్పుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ గా విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో బేబీ( Baby ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా సంచలనమైన విజయాన్ని అందుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా జూలై 14వ తేదీ విడుదలైనప్పటికీ ఇంకా హౌస్ ఫుల్ థియేటర్లతో ఈ సినిమా రన్ అవ్వడం విశేషం ఇలా ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం భారీగానే ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తూ పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.

ఇదిలా ఉండగా బేబీ సినిమా సీక్వెల్ చిత్రం బేబీ 2 ( Baby 2 ) సినిమాలో నటుడు బ్రహ్మాజీ ( Brahmaji ) లీడ్ యాక్టర్ గా నటిస్తున్నాడు అన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నటుడు బ్రహ్మాజీకి ఒక నెటిజన్ ట్విట్టర్ వేదికగా ఆయనను ట్యాగ్ చేస్తూ బేబీ లాంటి సినిమాలో మీరు లీడ్ యాక్టర్ గా ఎందుకు చేయకూడదన్న అంటూ ట్వీట్ చేశారు.దీనికి బ్రహ్మాజీ వివిధ రకాలుగా ఎమోజీలను షేర్ చేస్తూ ఈ ట్వీట్ ను డైరెక్టర్ సాయి రాజేష్ ను టాగ్ చేశారు.
వెంటనే సాయి రాజేష్ బ్రహ్మాజీ ట్వీట్ కు రిప్లై ఇస్తూ బేబీ 2 సినిమా చేద్దామన్నా అంటూ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ క్రమంలోనే పలువురు ఈ ట్వీట్ పై స్పందిస్తూ బ్రహ్మాజీకి పలు సలహాలు ఇస్తున్నారు.అన్న మీరు వీరాజ్ అశ్విన్( Viraj Aswin ) పాత్రకు కరెక్ట్ గా సరిపోతారు.బేబీ 2 సినిమాలో వైష్ణవి మోసం చేసినట్లుగా కాకుండా ఇక్కడ బ్రహ్మాజీ ఒక ఇద్దరు పాపలను మోసం చేస్తాడేమో వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక బ్రహ్మాజీ విషయానికి వస్తే ఈయన పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.







