5 పాటలకు 90 కోట్లు.. సరికొత్త రికార్డ్ నెలకొల్పిన రామ్ చరణ్ 'గేమ్ చేంజర్'

#RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపుని దక్కించుకున్న రామ్ చరణ్,( Ram Charan ) ఆ తర్వాత సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా #RRR మూవీ విడుదల సమయం లో ప్రారంభం అయ్యింది.

 Director Shankar Ram Charan Game Changer Movie Songs New Record Details, Directo-TeluguStop.com

ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో పూర్తి అవ్వాలి.

కానీ షూటింగ్ జరుగుతున్న సమయం లోనే శంకర్ కమల్ హాసన్ తో చేస్తున్న ‘ఇండియన్ 2 ‘ చిత్రాన్ని కూడా తిరిగి ప్రారంభించాల్సి వచ్చింది.నెల రోజుల్లో 15 రోజులు ఇండియన్ 2 కి పని చేస్తే మరో 15 రోజులు ‘గేమ్ చేంజర్’ చిత్రానికి( Game Changer ) పని చెయ్యాల్సి వచ్చింది.

అందుకే షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం లేదు.

Telugu Shankar, Game Changer, Dil Raju, Ram Charan, Ramcharan-Movie

ఇకపోతే శంకర్ తన సినిమాల్లో పాటలను ఎంత రిచ్ గా తీస్తాడో మన అందరికీ తెలిసిందే.మూడు దశాబ్దాల నుండి ఆయన పాటలను( Songs ) మనం చూస్తూనే ఉన్నాం.సినిమా బడ్జెట్ వంద శాతం లో ఆయన 50 శాతం పాటల కోసమే ఖర్చు చేస్తాడు.అలా ఆయన రీసెంట్ గా రామ్ చరణ్ తో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ లో కూడా పాటల కోసం అదే రేంజ్ లో ఖర్చు చేస్తున్నాడు.

అందుతున్న కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన ఈ సినిమాకి 5 పాటల కోసం 90 కోట్ల రూపాయిలు ఖర్చు చేసాడట.ఇది ఒక స్టార్ హీరో కమర్షియల్ సినిమాకి అయ్యే ఖర్చు.

అంతటి బడ్జెట్ శంకర్( Director Shankar ) కేవలం పాటల కోసం ఖర్చు చేసాడంటే, ఈ సినిమాని ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.

Telugu Shankar, Game Changer, Dil Raju, Ram Charan, Ramcharan-Movie

ఇక సినిమా బడ్జెట్ దాదాపుగా 300 కోట్ల రూపాయిలు దాటిపోయిందని అంటున్నారు.అయితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వకపోవడం ఇప్పుడు అభిమానులు చాలా కోపానికి గురి చేస్తుంది.ప్రతీ రోజు ట్విట్టర్ లో దిల్ రాజు ని( Dil Raju ) ట్యాగ్ చేసి ఫ్యాన్స్ బండ బూతులు తిడుతున్నారు.

కానీ ప్రొడక్షన్ టీం నుండి ఎలాంటి సమాచారం రాలేదు.ఇది అభిమానులను మరింత అసహనం కి గురి చేస్తున్న విషయం.విడుదల దగ్గర్లో లేకపోవడం వల్ల ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ అందించలేకపోతున్నాం అంటూ ప్రొడక్షన్ టీం కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు.అంటే సంక్రాంతి వరకు మూవీ నుండి ఎలాంటి అప్డేట్ ని అభిమానులు ఆశించకూడదు అన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube