సీనియర్ స్టార్ హీరోయిన్ మహానటి సావిత్రి( Savitri ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎంతో కష్టపడి ఒక్కోమెట్టు ఎక్కి మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది.
అయితే పెళ్లి తరువాత సావిత్రి కి సినీ ఇండస్ట్రీ లో పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి .మరీ ముఖ్యంగా తన భర్త జెమిని గణేషన్ తో కలిసి నటించిన సినిమా లు అన్ని వికటించాయి అని సినీ వర్గాల నుండి సమాచారం.సొంతంగా ఇద్దరు కలిసి చేసిన సినిమాలకు ఎక్కువగా సావిత్రి డబ్బు నే ఖర్చు చేసింది.

ఆ సమయంలోనే జెమిని గణేషన్ కి వేరే నటితో పరిచయం ఏర్పడుతుంది.దాంతో సావిత్రి కుటుంబంలో, కాపురం లో అలజడులు మొదలయ్యాయి.దానికి తోడు ‘చిన్నారి పాపలు( Chinnari Papalu )’ అనే సినిమా సావిత్రి ని ఆర్థికంగా కృంగిపోయేలా చేసింది.
స్వయంగా సావిత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షావుకారు జానకి జమున వంటి స్టార్ హీరోయిన్స్ పెట్టింది.ఈ సినిమా పై సావిత్రి ఎన్నో ఆశలు పెట్టుకుంది.
అయితే ఈ సినిమా లో నటించిన నటీనటులకు సావిత్రి ముందుగానే రెమ్యూనరేషన్( Remuneration ) ఇచ్చేసింది.

ముందే డబ్బు చేతికి రావడం తో కొందరు నటులు షూటింగ్ కి ఆలస్యం గా వెళ్ళేవారట.అంతేకాకుండా సావిత్రి సినిమా పూర్తి కాకముందే వేరే ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పేవారు.దాంతో చిన్నారి పాపలు సినిమా అనుకున్న సమయానికి పూర్తి చెయ్యలేకపోయింది సావిత్రి.
ఈ సినిమా సావిత్రి కి ఆర్థికంగా ఎన్నో నష్టాలు తీసుకొచ్చింది.అదే సమయంలో సావిత్రి పై ఐటీ శాఖ దాడులు జరిగాయి.
ఇలా సావిత్రి ఎన్నో ఆశలు పెట్టుకొని తీసిన సినిమా ఆమెని ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా ఇబ్బందులు పడేలా చేసింది.ఒకవేళ ఈ సినిమాను సావిత్రి డైరెక్టు చేయకపోయి ఉంటే, ముందుగానే పారితోషికం ఇవ్వకపోయి ఉంటే ఆమెపై ఆర్థికంగా ప్రభావం పడకపోయి ఉండేది.
అప్పటికే ఆమెకు ఆర్థికంగా ఎన్నో ఎదుటి దెబ్బలు తగిలాయి.ఈ సినిమాతో ఆమె కోల్పోలేకపోయింది.







