తమిళ హీరో కార్తీ( karthi ) గురించి మనందరికీ తెలిసిందే.మొదట కోలీవుడ్‌లో పరుత్తివీరన్ అనే చిత్రంతో హీరోగా పరిచయం అయిన కార్తీ ఇప్పటి వరకు దాదాపుగా 24 సినిమాల్లో నటించారు.
వీటిలో 90 శాతం హిట్ చిత్రాలు కావడం విశేషం.కార్తీ నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి కూడా విడుదల అయ్యాయి.
కాగా ఇటీవల కార్తీ నటించిన విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్దార్ చిత్రాలు వరుసగా విడుదల అయ్యి సూపర్ హిట్ కావడంతో పాటు హ్యాట్రిక్ సాధించారు.తాజాగా హీరో కార్తీ తన 25వ చిత్రం జపాన్( japan movie ) పూర్తి చేశారు.
దర్శకుడు రాజు మురుగన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిచింది.ఇందులో నటి అనూ ఇమాన్యుల్ నాయకిగా నటించింది.ఇది ఇలా ఉంటే జపాన్ చిత్ర టైటిల్‌కు విశేష స్పందన వచ్చింది.
అదేవిధంగా ఇందులో కార్తీ వివిధ గెటప్ లు ధరించడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.కాగా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో జరుపుకుంటున్న ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణ జరగాల్సి ఉంది.
కాగా ఈ మూవీని దీపావళి పండుగ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా విచిత్ర వ్యాపారం ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.జపాన్ చిత్ర ప్రీ బిజినెస్ మాత్రమే రు.150 కోట్లు జరిగిందని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి.ఇప్పటివరకు కార్తీ నటించిన చిత్రాలన్నిటికంటే అత్యధికంగా వ్యాపారం జరిగిన చిత్రం ఇదే అవుతుంది.కాగా నటుడు కార్తీ ప్రస్తుతం తన 26వ చిత్రంలో నటిస్తున్నారు.దీనికి నలన్ కుమార సామి( Nalan Kumarasamy ) దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్‌లో పూర్తి అవుతుందని సమాచారం.
తదుపరి 96 చిత్రం ఫ్రేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నటించనున్నారు.ఇది నవంబర్‌లో సెట్ పైకి వెళ్లనుంది.
ఆ తర్వాత కార్తీ నటించే సర్దార్ 2, ఖైదీ 2 చిత్రాలు 2024లో ప్రారంభం అవుతాయని సమాచారం.అలా ప్రస్తుతం హీరో కార్తీ చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి.







