సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”( Guntur Karam ). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎదురు చూడని అభిమాని లేడు.
అయితే ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తుంటే ఈ సినిమా అంత ఆలస్యం అవుతూ వస్తుంది.సినిమా ప్రకటించినప్పటి నుండే అనేక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి.

ఇక అన్ని ఎదుర్కొని షూట్ స్టార్ట్ అయ్యింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు టీమ్ గ్యాప్ తీసుకున్నారు.అయితే ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ లభించింది.మహేష్ ఊర మాస్ లుక్( Mahesh Mass Look ) కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.ఇక అంతా బాగానే జరుగుతున్న సమయంలో మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి మళ్ళీ వెకేషన్ కు వెళ్లడంతో ఈ సినిమా మరోసారి వాయిదా పడక తప్పలేదు.
అయితే మరో వారంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు( Mahesh Babu Birthday ) ఉంది అనే విషయం విదితమే.ఈ అకేషన్ రోజు గుంటూరు కారం నుండి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా ఫస్ట్ సింగిల్ ఇవ్వబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
మరి ఇది నిజమేనట.ఫస్ట్ సింగిల్ ను మహేష్ బర్త్ డే కోసం టీమ్ రెడీ చేశారట.

ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు కానుకగా మొదటి సాంగ్( Guntur Karam Song ) ను రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉండగా సాంగ్ ను ముంబై వెళ్లి రికార్డ్ చేసిన థమన్ త్వరలో సూపర్ స్టార్ కు కూడా వినిపిస్తారట.మరి మహేష్ అప్రూవల్ ఇస్తే ఈ సాంగ్ ను బర్త్ డే కానుకగా రిలీజ్ చేయనున్నారని అంటున్నారు.మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు.కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.







