తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) వచ్చే వారంలో జైలర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు.అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఈ సినిమా అలరిస్తుందని తమిళ మీడియా వారు చాలా నమ్మకంగా ఉన్నారు.
రజినీకాంత్ మొదటి సారి తన వయసుకు తగ్గ పాత్రను చేస్తున్నాడు.ఆరు ఏళ్ల కుర్రాడికి తాత పాత్రలో రజినీకాంత్ కనిపించబోతున్నాడు.
విక్రమ్ సినిమా లో కమల్ హాసన్ ఎలా అయితే తాత గా కనిపించాడో ఇప్పుడు అలాగే రజినీకాంత్ కూడా వయసుకు తగ్గ పాత్ర లో కనిపించబోతున్నాడు.
ఆయనకు జోడీగా రమ్యకృష్ణ( Ramya Krishna ) కనిపించబోతుంది.
తమన్నా పాత్ర ఏంటి అనేది క్లారిటీ లేదు.ఇక ఈ సినిమా కథ విషయం లో సోషల్ మీడియా లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
తాజాగా ట్రైలర్ రిలీజ్ అయిన నేపథ్యంలో మరింతగా కథ గురించి చర్చ మొదలు అయింది.మాజీ జైలర్ అయిన రజినీకాంత్ కొడుకు ఒక పోలీస్ ఆఫీసర్.
ఆయన ఒక కేసు విషయంలో రౌడీ లతో గొడవ పడుతాడు.

కొన్ని రోజుల తర్వాత రజినీకాంత్ కొడుకు కిడ్నాప్ అవుతాడు.కనిపించకుండా పోయిన కొడుకుని మరియు కొడుకు మధ్య లో వదిలేసిన కేసును చేపట్టడం తో జైలర్( Jailer Movie ) తిరిగి ఫామ్ లోకి వస్తాడు.ముసలి వయసులో రజినీకాంత్ చేసే సాహసాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి అంటున్నారు.
అలా రజినీకాంత్ ను తాత పాత్రలో చూడబోతున్నాం అంటూ కథ గురించి చర్చ జరుగుతోంది.

గతంలో ఇలాంటి కథ తో సినిమా వచ్చింది.కనుక ఇప్పుడు మళ్లీ ఈ కథతో వస్తే రజినీకాంత్ కు సక్సెస్ దక్కేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించాడు.
పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకోగా తమిళనాట జైలర్ కి మంచి బజ్ క్రియేట్ అయింది.కానీ తెలుగు లో మాత్రం ఈ సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదు.







