బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ( Anasuya ) ప్రస్తుతం వెండితెర నటిగా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ వెండితెరపై సందడి చేస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈమె బుల్లితెరకు గుడ్ బై చెప్పి వెండి తెరకే పరిమితమయ్యారు.
ఈ విధంగా నటిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ తనకు ఏమాత్రం విరామం దొరికిన తన భర్త పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఈమె ప్రస్తుతం అమెరికా ( America ) వెకేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా అనసూయ తన వెకేషన్ కి సంబంధించిన అన్ని ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ సందర్భంగా అనసూయ తాజాగా తన వెకేషన్ లో భాగంగా గుర్రాలను ( Horses )చూస్తూ కొంత సమయం గడిపిందని చెప్పాలి.అంతేకాకుండా తాను గుర్రాలతో సమయం గడుపుతూ ఉన్నటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నటువంటి అనసూయ గుర్రాలతో ఇలా సమయం గడపడం, తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని ఈమె తెలియజేశారు.ఇలా వీటితో సమయం గడుపుతుంటే నాకు మా నాన్న గుర్తుకు వస్తున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు.

జంతువులలో అత్యంత విశ్వాసపాత్రులైనవి గుర్రాలని, ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అని ఈమె తెలిపారు.ఇక మా ఫ్యామిలీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు అంటూ ఈ సందర్భంగా అనసూయ గుర్రాలతో సమయం గడుపుతూ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక అనసూయ పోస్ట్ ని బట్టి చూస్తుంటే తన తండ్రి గుర్రాలతో ఎంతో సన్నిహితంగా ఉండేవారని తెలుస్తుంది.అయితే అనారోగ్య సమస్యల కారణంగా కదా రెండు సంవత్సరాల క్రితం అనసూయ తండ్రి మరణించిన విషయం తెలిసిందే.
ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప 2 సినిమా( Pushpa 2 Movie ) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.







