తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాజమౌళి RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్నారు.
ప్రస్తుతం ఈయన మహేష్ బాబు( Mahesh Babu )తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు.ఇలా దర్శకుడు ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి రాజమౌళి గురించి ప్రముఖ సీనియర్ నిర్మాత సి.
కళ్యాణ్ ( C.Kalyan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన రాజమౌళి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ప్రేక్షకులలో సినిమాల పట్ల ఉన్నటువంటి అభిరుచి మారిపోతుంది.అయితే ప్రేక్షకుల అభిరుచిని వారి నాడి పట్టుకోవడం ఏ డైరెక్టర్ వల్ల చేతకాదని తెలిపారు.ఇక రాజమౌళి వల్ల కూడా అది సాధ్యం కాదని ఈయన తెలియజేశారు.
ఇక రాజమౌళి ఇప్పటివరకు ఒక ఫ్లాప్ కూడా లేకుండా కొనసాగుతున్నారు అయితే రాజమౌళి ఇలా హిట్స్ అందుకోవడానికి కారణం స్టార్ హీరోలేనని తెలిపారు.ఈయన ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక సినిమా మాత్రమే చేస్తారు అది కూడా స్టార్ హీరోలతో మాత్రమే సినిమా చేస్తారు.

ఇలా చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే తప్పకుండా ఆ సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారని ఆ సినిమాలో హిట్ అవుతాయని సి కళ్యాణ్ వెల్లడించారు.అలాకాకుండా కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఏడాదికి నాలుగు ఐదు సినిమాలు చేస్తేనే హిట్ ఫ్లాప్ అనేది ఏంటో తెలుస్తుందని తెలిపారు.కొత్త వాళ్లతో సినిమాలు చేసి థియేటర్లకు జనాలను రప్పించినప్పుడే దర్శకుల అసలైన ప్రతిభ బయటపడుతుంది అంటూ ఈ సందర్భంగా కళ్యాణ్ రాజమౌళి గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.







