తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రష్మిక మందన ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారడంతో పాటు ఆమె క్రేజ్ మరింత పెరిగింది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్ప 2 సినిమా( Pushpa 2 )లో నటిస్తోంది.
దాంతో పాటుగా బాలీవుడ్ లో యానిమల్( Animal ) అనే సినిమాలో కూడా నటిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఒక ఈవెంట్‌కి టైగర్ ష్రాఫ్( Tiger Shroff )తో కలిసి వెళ్లింది.ఇందులో భాగంగా హోస్ట్ ప్రశ్న అడగ్గా.నాకు నరుటోతో ఆల్రెడీ పెళ్లయిపోయింది.నా మనసులో అతడే ఉన్నాడు అని రష్మిక ఫన్నీ కామెంట్స్ చేసింది.నరుటో( Naruto ) అనేది ఫేమస్ అయిన ఎనిమీ సిరీస్‌లో ఒక పాత్ర పేరు.
వీటికి ప్రత్యేక అభిమానులు ఉంటారు.అందులో రష్మిక కూడా ఒకరు.
ఇప్పుడు ఈమె నరుటో గురించి మాట్లాడటం ఇంట్రెస్టింగ్‌గా మారింది.ఈ సందర్బంగా రష్మిక చేసిన వాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇకపోతే రష్మిక విషయానికి వస్తే.ప్రస్తుతం రష్మిక మందన వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.వీటితో పాటు పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ భారీగానే సంపాదిస్తుంది రష్మిక.అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది.







