నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో భగవంత్ కేసరి( Bhagavant Kesari ) అనే సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు వచ్చాయి.
సినిమా ను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లగా తెలుస్తోంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా తో బాలయ్య హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకోబోతున్నాడు.
అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య కు ఈ సినిమా కూడా భారీ విజయాన్ని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి.

అంతా బాగనే ఉంది కానీ దర్శకుడు అనిల్ రావిపూడి( Director Anil Ravipudi ) ఈ సినిమా యొక్క టైటిల్ విషయం లో ఏమైనా తప్పు చేశాడా అంటూ కొందరు బాలయ్య ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.బాలయ్య సినిమా అంటే పవర్ ఫుల్ గా ఉండాలి.ఈ సినిమా టైటిల్ భగవంత్ కేసరి అనేది అంత పవర్ ఫుల్ గా అనిపించడం లేదు.
అఖండ, వీర సింహారెడ్డి, సింహా, లెజెండ్ రేంజ్ లో భగవంత్ కేసరి టైటిల్ పవర్ ఫుల్ గా లేదు అంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు.ఈ నేపథ్యం లో బాలయ్య అభిమానులు( Balayya Fans ) కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఇలాంటి టైటిల్స్ తో వచ్చిన బాలయ్య ఫెయిల్ అయ్యాడు.కనుక మంచి టైటిల్ ను అది కూడా సింహా పదం కలిసి ఉన్న టైటిల్ ను పెట్టి ఉంటే బాగుండేది అంటూ నందమూరి అభిమానులు అంటున్నారు.

ఇక ఇప్పటి వరకు అపజయం అనేది ఎరుగని దర్శకుడు అనీల్ రావిపూడి అన్ని ఆలోచించిన తర్వాత మాత్రమే ఈ సినిమా కు ఆ టైటిల్ పెట్టి ఉంటాడు అనేది కొందరి అభిప్రాయం.ఆయన తప్పకుండా కథ కు తగ్గట్లుగా.అభిమానుల అభిరుచికి తగ్గట్లుగానే టైటిల్ ను పెట్టి ఉంటాడు.కనుక ఆందోళన చెందాల్సిన పని లేదు.ఎక్కువగా హైరానా అక్కర్లేదు అంటున్నారు.భగవంత్ కేసరి సినిమా లో బాలయ్య కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా బాలయ్య కూతురు పాత్ర లో శ్రీలీల( Sreeleela ) నటిస్తోంది.







