మాజీ ప్రియురాలిని స్నేహితులతో అత్యాచారం చేయించిన ప్రియుడు..!

ఇటీవలే కాలంలో ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ పోతోంది.చాలామంది అమాయకులు ప్రేమ పేరుతో గుడ్డిగా నమ్మి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

 The Boyfriend Who Raped The Ex-girlfriend With His Friends..!, Boyfriend , Ex-gi-TeluguStop.com

ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలుతో సన్నిహితంగా ఉండే సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలతో ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడమే కాకుండా తన స్నేహితులతో కూడా అత్యాచారం చేయించి వారి వద్ద డబ్బులు వసూలు చేసేవాడు.ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.

అసలు వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.

బెంగుళూరు( Bangalore )లోని విద్యారణ్యపురకు చెందిన అండి జార్జ్ (28) ఓ ప్రైవేట్ పాఠశాలలో డాన్స్ టీచర్ గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.ఈ జార్జ్ కు ఈశాన్య బెంగుళూరుకు చెందిన ఒక యువతి (23) సోషల్ మీడియా( Social media )లో రెండేళ్ల క్రితం పరిచయమైంది.

వీరి పరిచయం ప్రేమగా మారడంతో తరచూ ఇద్దరు కలుసుకొని మాట్లాడుకునేవారు.

Telugu Bangalore, Boyfriend, Girlfriend, Latest Telugu-Latest News - Telugu

జార్జ్ ప్రవర్తన ఆ యువతీకి నచ్చకపోవడంతో దూరం పెట్టేసింది.అయితే జార్జ్ ఆ యువతితో సన్నిహితంగా ఉండే సమయంలో తీసిన ఫొటోలు, వీడియో లను ఆ అమ్మాయికి చూపించి పలుమార్లు ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఇంతటితో ఆగకుండా తన స్నేహితులైన సంతోష్ (28), శశి కుమార్ (30) లతో కూడా సన్నిహితంగా ఉండాలని ఆ యువతిని బెదిరించాడు.

ఆ అమ్మాయి అంగీకరించకపోవడంతో ఫోటోలు, వీడియోలు చూపించి బెదిరించి బలవంతంగా ఆమెను ఒప్పించాడు.

Telugu Bangalore, Boyfriend, Girlfriend, Latest Telugu-Latest News - Telugu

తన స్నేహితులతో ఆ యువతి సన్నిహితంగా ఉండే సమయంలో వీడియోలను రికార్డు చేసి స్నేహితుల వద్ద కూడా డబ్బులు వసూలు చేశాడు.కొన్ని రోజులుగా ఆ యువతి ఆ ముగ్గురిని కలవడం మానేయడంతో.జార్జ్ ఫోటోలు, వీడియోలను ఆ యువతి స్నేహితులకు షేర్ చేశాడు.

జార్జ్ వేధింపులు భరించలేక ఆ యువతి చివరకు పోలీసులకు( Police ) ఫిర్యాదు చేయడంతో పోలీసులు జార్జ్ ను అరెస్టు చేసి, అతని నుంచి ల్యాప్ టాప్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube