వంగ పంట( Brinjal crop )కు బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వాటి వల్ల వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని మిగిలిస్తాయి.బ్యాక్టీరియా వల్ల తెగులు సోకితే మొక్కలు లేత పసుపు రంగులో మారి చిన్న, మృదువైన, సన్నని మరియు వికృతి చెందిన కలిగి ఉంటాయి.
క్రమంగా మొక్క ఎదుగుదల ఆగిపోతుంది.వంగ కాయలు పరిపక్వం చెందడంలో విఫలం అవుతాయి.
కాబట్టి వంగ పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఏవైనా తెగులు సోకితే తొలి దశలోనే అరికట్టాలి.
వంగ పంటకు బ్యాక్టీరియా ల వల్ల ఎటువంటి తెగులు సోకకుండా ఉండాలంటే తెగులు నిరోధక మొక్కలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.
వంగ పంటతోపాటు మిరప, మిరియాలు లాంటి పంటలు సాగు చేయకూడదు.మొక్కల మధ్య, వరుసల మధ్య కాస్త దూరం ఉండేటట్లు నాటుకోవాలి.ఏవైనా మొక్కలకు తెగులు సోకినట్లు అనుమానం వస్తే వెంటనే ఆ మొక్కలను పంట నుండి వేరు చేసి కాల్చి నాశనం చేయాలి.కలుపు మొక్కల వల్ల ఈ తెగులు అనేవి తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
కాబట్టి ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తొలగిస్తుండాలి.

పంట పొలంలో అవరోధ పంటలను వేయాలి.ఇవి పంటను నేరుగా ప్రభావితం చేసే వాహకాలకు అడ్డం కలిగిస్తుంది.2 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి.సేంద్రియ ఎదవులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

ఇక సేంద్రీయ పద్ధతి( Organic method )లో బ్యాక్టీరియా వల్ల వచ్చే తెగులు అరికట్టాలంటే లేస్వింగ్, డామ్సెల్ బగ్, పైరేట్ బగ్ లాంటి ప్రయోజకరమైన కీటకాలను ఉపయోగించి ఈ తెగులను వ్యాప్తి చేసే గుడ్డు మరియు లార్వాలను అరికట్టవచ్చు.రసాయన పద్ధతిలో ఈ తెగులను అరికట్టాలంటే.థియామెథోక్సామ్, ఎసిటామిప్రిడ్, మలాథియాన్ లాంటి క్రిమిసహారక మందులను ఉపయోగించి తొలిదశలోనే బ్యాక్టీరియా వల్ల వచ్చే తెగులను అరికట్టాలి.







