శ్రీ లీల.( Sreeleela ) గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.
సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా ఆ స్టార్ హీరోల తరఫున నటించే అవకాశాలను సొంతం చేసుకుంది.
ఈ ముద్దుగుమ్మ నటించినది కేవలం రెండు సినిమాలే అయినప్పటికీ భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.ఇంకా ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు పదికి పైగా సినిమాలు ఉన్నాయి అంటే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే శ్రీ లీలకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

వాటిల్లో ఎక్కువ శాతం స్టార్ హీరోల సినిమాలే ఉండటం విశేషం.ఇప్పటికే శ్రీలీల బాలకృష్ణతో భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కూడా ఈ సంవత్సరం దసరాకి ప్రేక్షకులు ముందుకు రానుంది.
అలాగే పవన్ తో ఓజి సినిమాలో నటిస్తోంది.ఈ మూవీ కూడా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ విధంగా శ్రీలీల వరుసగా టాలీవుడ్ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోల( Senior Star Heroes ) సినిమాలలోనే ఎక్కువగా నటిస్తుంది.కేవలం ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో శ్రీ లీల యంగ్ హీరోస్ తో కన్నా సీనియర్ హీరోలతోనే సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తోందట.

ఎందుకంటే ఆ హీరోలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుంది.ఎలాంటి సినిమా తీసిన హిట్ కొట్టించడానికి ఫ్యాన్స్ ఉంటారు.తద్వారా శ్రీ లీల ఖాతాలో హిట్లు పడతాయి.ఇదే మెయిన్ రీజన్ అని కూడా తెలుస్తోంది.ప్రస్తుతం శ్రీ లీల చేతిలో ఉన్న సినిమాలలో దాదాపు ఒక 5, 6 సినిమాలు హిట్ అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు వరసగా అవకాశాలు క్యూ కడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.శ్రీ లీలా మొదట పెళ్లి సందడి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ ఇచ్చిన తెలిసిందే.
తర్వాత రవితేజ తో కలిసి ధమాకా( Dhamaka ) సినిమాలు నటించింది.







