జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) తన మకాం ను హైదరాబాదు నుంచి మంగళగిరి కి మార్చేస్తున్నారు.ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, పూర్తిగా మంగళగిరి నుంచి అన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువుగా పవన్ తన నివాసాన్ని ఇక్కడే ఏర్పాటు చేసుకుంటున్నారు.
హైదరాబాదులో ఉన్న జనసేన ఆఫీసును మంగళగిరి కి తరలించేశారు.కేంద్ర కార్యాలయ సిబ్బంది , ఫైల్స్ ఇతర విభాగాలు, కంప్యూటర్లను హైదరాబాద్ నుంచి ఇప్పటికే మంగళగిరి కి తరలించినట్లు తెలుస్తోంది.
ఇక పవన్ కూడా మంగళగిరిలోనే మకాం ఉండబోతున్నారు.

ఏవైనా పనులు, సినిమా వ్యవహారాలు ఉంటే హైదరాబాద్( Hyderabad ) కు వెళ్లి రావడం మినహా మిగిలిన సమయం అంతా మంగళగిరిలోనే అందరికీ అందుబాటులో ఉండాలని పవన్ నిర్ణయించుకున్నారు.ఏపీ ప్రజలకు , కార్యకర్తలకు దగ్గరగా ఉన్నానని, అండగా ఉన్నానని చెప్పుకునేందుకు మంగళగిరి( Mangalagiri )లో పవన్ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.అంతే కాకుండా పదేపదే తాను హైదరాబాదు వాసిని , అక్కడే మకాం ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు అంటూ పదేపదే రాజకీయ విమర్శలు వస్తుండడం, ఇక ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) సైతం ఇదే అంశంపై తనను విమర్శిస్తూ ఉండడం వంటి కారణాలతో ఏపీలోనే మకాం ఉండాలని పవన్ నిర్ణయం తీసుకోవడానికి కారణమట.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన( Janasena ) సత్తా చాటుతామని ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తామంటూ పవన్ గతంలో అనేక ప్రకటనలు చేశారు.అయితే తెలంగాణ విషయాన్ని పక్కనపెట్టి పూర్తిగా ఏపీ రాజకీయాలకే( AP Politics ) పరిమితమయ్యారు.అదీ కాకుండా ఏపీ కంటే ముందుగా తెలంగాణలోని ఎన్నికలు జరగబోతున్నాయి .అయినా పవన్ తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోతున్నారు.ఏపీ రాజకీయాలతోనే ఆయన తీరిక లేకుండా ఉంటున్నారు.అందుకే తెలంగాణ అంశాన్ని పక్కనపెట్టి పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే ఫోకస్ పెట్టాలని , తనపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలనే ఆలోచనతో పవన్ ఉన్నారు.
అందుకే అకస్మాత్తుగా హైదరాబాదును వీడి మంగళగిరిలో మకాం వేయాలని పవన్ నిర్ణయించుకున్నారట.ఇక పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులో ఉంటూ , ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెంచుకునేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.







